Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాట రాజకీయ సంక్షోభం.. గవర్నర్‌‍తో స్టాలిన్ భేటీ.. పన్నీర్‌కే సపోర్ట్ అంటారా?

తమిళనాట ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై గ‌వ‌ర్న‌ర్ నుంచి ఇంకా ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. గురువారం సాయంత్రం తమిళ రాష్ట్ర ఇన్ ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో ప‌న్నీర్ సెల్వం, శ‌శిక‌

Advertiesment
MK Stalin
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (19:02 IST)
తమిళనాట ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై గ‌వ‌ర్న‌ర్ నుంచి ఇంకా ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. గురువారం సాయంత్రం తమిళ రాష్ట్ర ఇన్ ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో ప‌న్నీర్ సెల్వం, శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ వేర్వేరుగా భేటీ అయ్యారు.

కానీ ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష డీఎంకే నేత స్టాలిన్ రాజ్‌భ‌వ‌న్‌కు వ‌చ్చారు. పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో వచ్చి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన ఆయ‌న‌.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తున్నారు. పన్నీర్‌కే తమ మద్దతు ఉంటుందని గవర్నర్‌తో స్టాలిన్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
గ‌వ‌ర్న‌ర్‌తో స్టాలిన్ భేటీ అవ‌డం మ‌రోసారి ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర రాజకీయ సంక్షోభంపై స్టాలిన్ గవర్నర్‌తో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌కు వచ్చిన స్టాలిన్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విద్యాసాగర్‌తో చర్చలు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే అధినేత్ర శశికళ రిసార్టులలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారనే అంశంపై హైకోర్టు శుక్రవారం స్పందించింది. అదే సమయంలో డిజిపి, సీఎస్ గిరిజా వైద్యనాథన్‌లు శుక్రవారం ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారుతారోననే భయంతో శశికళ వారితో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళకు మద్దతిస్తాం.. తిరునావుక్కరసు ప్రకటనపై కాంగ్ ఎమ్మెల్యేల ఫైర్