Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైనికుడి ఆరోపణలో పస లేదు.. రేషన్ బాగానే ఇస్తున్నాం అన్న ఆర్మీ

సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు అద్వాన్నపు ఆహారం అందిస్తున్నారని, సైనికుల అవసరాలను సరిగా పట్టించుకోవడం లేదని బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ చేసిన ఆరోపణల్లో పస లేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

Advertiesment
సైనికుడి ఆరోపణలో పస లేదు.. రేషన్ బాగానే ఇస్తున్నాం అన్న ఆర్మీ
హైదరాబాద్ , శనివారం, 14 జనవరి 2017 (01:47 IST)
సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు అద్వాన్నపు ఆహారం అందిస్తున్నారని, సైనికుల అవసరాలను సరిగా పట్టించుకోవడం లేదని  బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ చేసిన ఆరోపణల్లో పస లేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సైన్యంలో ఉన్నతస్థానాల్లో పేరుకుపోయిన అవినీతి వల్లే సైనికబలగాలు తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారని భారత సరిహద్దు భద్రతా దళం 29వ బెటాలియన్ సోల్జర్ తేజ్ బహదూర్ యాదవ్ చేసిన ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణ వెలికి రాగానే హోంమంత్రి రాజనాథ్ సింగ్ ఈ అంశంపై తక్షణ నివేదికను అందించాలని, ఈ ఆరోపణపై తగిన చర్య తీసుకోవాలని తన మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసారు. 
 
తమ సైనికుడి అరోపణలపై స్పందించిన బీఎస్ఎఫ్ వెంటనే ఆ జవాను వీడియో పంపిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలో ఆ సైనికుడు చేసిన ఆరోపణలో పస లేదని, నాసిరకం ఆహారం పెడుతున్నట్లు ఆధారాలు కూడా లేవని శుక్రవారం నిర్ధారించింది. సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికులు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ వారికి క్రమం తప్పకుండా ఆహార పదార్ధాల రేషన్ అందిస్తున్నట్లు హోంశాఖకు పంపిన నివేదికలో బీఎస్ఎఫ్ తెలిపింది. 
 
అంతర్జాతీయ సరిహద్దుల్లో మోహరించిన సైన్యం వాతావరణ పరంగా, ఇతరత్రా కూడా అత్యంత విషమ పరిస్థితులను ఎదుర్కొంటూంటడం వాస్తవమేనని, కానీ ఆధీన రేఖ వద్ద ఉన్న అధికారులకు, సైనికులకు నాణ్యమైన ఆహారాన్నే తగినంత స్థాయిలో అందిస్తున్నామని ఆ నివేదికలో బీఎస్ఎఫ్ పొందుపర్చింది. 
సైనికుల దుస్థితిపై వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన సైనికుడు యాదవ్ గతం ఏమంత గొప్పగా లేదని, అనుమతి లేకుండా అనేకసార్లు డ్యూటీకి ఎగ్గొట్టాడని, మద్యపానానికి బానిసయ్యాడని, పై అధికారులతో అమర్యాదగా ప్రవర్తించేవాడని, క్రణశిక్షణ లేకుండా గడిపాడని బీఎస్ఎఫ్ అధికారుల నివేదిక పేర్కొంది.
ఇప్పటికే డీఐజీ స్థాయి అధికారిని యాదవ్ ఉన్న ప్రాంతానికి పంపామని, విచారణ పూర్తయ్యాక వాస్తవాలను త్వరలో బయటపెడతామని బీఎస్ఎఫ్ పేర్కొంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.. షూ పాలిష్ కూడా? ఇప్పుడేమో సూసైడ్ చేసుకోమంటున్నారు: జవాను