Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'యువరాజ్' వయసు ఏడేళ్లే... కానీ వీర్యపు చుక్క ఖరీదు రూ.400

దాని వయసు ఏడేళ్లు. కానీ, దాని వీర్యపు చుక్క ఖరీదు రూ.400. యేడాదికి రూ.కోటి ఆదాయం. ఇంత ఆదాయం సంపాదించి పెడుతున్నది ఏంటనే కదా మీ సందేహం. ఓ దున్నపోతు. దాని పేరు యువరాజ్ వయసు ఏడేళ్లు.

Advertiesment
Meet Yuvraj
, మంగళవారం, 1 నవంబరు 2016 (08:39 IST)
దాని వయసు ఏడేళ్లు. కానీ, దాని వీర్యపు చుక్క ఖరీదు రూ.400. యేడాదికి రూ.కోటి ఆదాయం. ఇంత ఆదాయం సంపాదించి పెడుతున్నది ఏంటనే కదా మీ సందేహం. ఓ దున్నపోతు. దాని పేరు యువరాజ్ వయసు ఏడేళ్లు. 1500 కేజీల బరువు. ఆరు అడుగుల ఎత్తు. 15 అడుగుల పొడవుతో కళ్లుచెదిరే రాజసంతో ఉట్టిపడుతోంది. ఈ దున్న ఖరీదు అక్షరాలా రూ.11 కోట్లు. 
 
నగరంలోని సదర్‌ ఉత్సవాల్లో విజేతగా నిలిచేందుకు రేసులో ఉంది. ఈ దున్నపోతు వీర్యపు చుక్క ఖరీదు రూ.400. ఇలా వీర్యం అమ్ముకోవడం ద్వారానే యేడాదికి కోటి రూపాయలకుపైగా సంపాదిస్తానని దీని యజమాని కరమ్‌బీర్‌ సింగ్‌ అంటున్నారు. 
 
యువరాజ్‌కు పుట్టిన దున్న రూ.10 లక్షలకు అమ్ముడు పోయిందనీ చెప్పాడు. ఆకారానికి మల్లే యువరాజ్‌ మెనూ కూడా పెద్దదే! రోజుకు 15 కిలోల యాపిల్స్‌, 20 లీటర్ల పాలు, అయిదు కిలోల క్యారెట్‌, ఆరు కిలోల బెల్లం, కాజు, శనగలు హాంఫట్‌ చేస్తుందట! దీనికి దాణా అదనం. అంతేకాదు.. సంపంగి నూనెతో మసాజ్‌.. స్నానం గట్రా పనులు చూసుకునేందుకు ప్రత్యేకంగా నలుగురు పనివాళ్లు ఉన్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్ పిలిచాడనీ బస్టాండ్‌కు వెళితే మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్ చేయించాడు