Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రాష్ట్ర దున్నపోతులు చాలా కాస్ట్లీ గురూ! పశువుల పాకలో ఏసీ, ఫ్యాన్లు ఉండాల్సిందే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు జాతి పశువులకు ప్రత్యేక గుర్తింపు, పేరు ఉంది. అలాగే, హర్యానా రాష్ట్ర దున్నపోతులకు మంచి పేరే ఉంది. అందుకే ఈ దున్నపోతుల ధర వింటే ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే

ఆ రాష్ట్ర దున్నపోతులు చాలా కాస్ట్లీ గురూ! పశువుల పాకలో ఏసీ, ఫ్యాన్లు ఉండాల్సిందే...
, శుక్రవారం, 26 మే 2017 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు జాతి పశువులకు ప్రత్యేక గుర్తింపు, పేరు ఉంది. అలాగే, హర్యానా రాష్ట్ర దున్నపోతులకు మంచి పేరే ఉంది. అందుకే ఈ దున్నపోతుల ధర వింటే ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. వీటి ధర రూ.కోట్లలో ఉంటుంది. 
 
ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు రాజస్థాన్‌లోని కోటాలో ‘గ్లోబర్‌ రాజస్థాన్‌ అగ్రిటెక్‌ మీట్‌’ జరుగుతోంది. ఇందులో ప్రధాన ఆకర్షణగా ముర్రాజాతికి చెందిన సుల్తాన్, యువరాజ్ అనే దున్న పోతులు ఉన్నాయి. గతంలో యువరాజ్‌ను 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తానని ఒక వ్యక్తి ముందుకు రాగా, దానిని విక్రయించేందుకు దాని యజమాని కరంవీర్ సింగ్ నిరాకరించారు.
 
అయితే, ఇపుడు సుల్తాన్‌ దున్నను కొనుగోలు చేస్తానంటూ దక్షిణాఫ్రికాకు చెందిన ఒక వ్యాపారి రూ.21 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ఆఫర్‌ను సుల్తాన్ యజమాని నరేష్ బేనివాల్ నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. 
 
దీనికి కారణం లేకపోలేదు. దేశంలో మేలు జాతి పాడి గేదెల ఉత్పత్తికి ఉపయోగపడే ఈ దున్నపోతుల వీర్యానికి భారీ డిమాండ్ ఉంది. కాగా, సుల్తాన్ ఒక్కో తడవకు 6 మిల్లీ లీటర్ల వీర్యాన్ని ఇస్తుండగా, దానిని శాస్త్రీయ పద్దతిలో 600 డోసులుగా తయారు చేసి, ఒక్కో డోసును 250 రూపాయలకు విక్రయిస్తున్నట్టు నరేష్ తెలిపారు.
 
ఇలా ఏడాదికి సుల్తాన్ 54,000 డోసులు ఇస్తుండగా, యువరాజ్ 45,000 డోసుల వీర్యం ఇస్తోంది. ఇలా ప్రతి ఏటా పెద్ద మొత్తంలో కరమ్ వీర్ సింగ్‌కు ఆదాయం వస్తోంది. ఇక వీటికి రోజుకు ఆహారంగా 20 లీటర్ల పాలతో పాటు ఆరోగ్యవంతమైన, బలవర్ధకమైన దాణా తినిపిస్తారు. రోజుకు మూడు సార్లు స్నానం చేయిస్తారు. ఏసీ, ఫ్యాను వంటి ఇతర సౌకర్యాలు సరేసరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో లేచిపోయినా తెచ్చుకున్న భర్త... తలదించుకునే పని చేసింది...