Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తపై అత్యాచార యత్నం.. చెంప చెళ్లుమనిపించడంతో చంపేశాడు..

Advertiesment
అత్తపై అత్యాచార యత్నం.. చెంప చెళ్లుమనిపించడంతో చంపేశాడు..
, శనివారం, 30 జనవరి 2021 (19:52 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధాలు, వావివరసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి సొంత అత్తపైనే కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. అయితే అందుకు ఆమె ప్రతిఘటించడంతో.. దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మీరట్ జిల్లాలోని జాని ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక్క రోజు వ్యవధిలో ఆ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య చేయబడిన మహిళ మేనల్లుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. 
 
నిందితుడు తన అత్తను రేప్ చేయాలని చూశాడు. గతంలో రెండు సార్లు ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే ఇది సరైన పద్దతి కాదని ఆమె అతడికి నచ్చజెప్పింది. మరోవైపు ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పకపోవడంతో అతడిని ధైర్యం ఎక్కువైంది. కానీ బుధవారం ఆమె పిల్లలు స్కూల్‌కి వెళ్లగానే నిందితుడు ఇంట్లోకి దూరాడు. ఆమెను రేప్ చేసేందుకు యత్నించాడు. దీనికి ఆమె ప్రతిఘటించింది. నిందితుడిని చర్యను అడ్డుకోవడంతో పాటుగా అతని చెంప దెబ్బ కొట్టింది.
 
అతని అసభ్య ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించింది. దీంతో నిందితుడు ఆమెపై దాడి చేశాడు. తనను నిరాకరించిందనే కోపంతో కిచెన్‌లోని కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెన్‌డ్రైవ్‌లో ప్రైవేట్ ఫోటోలు.. ఐదు లక్షల డిమాండ్.. బ్లాక్ మెయిల్.. ఎక్కడ?