Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు నా పుట్టినరోజు.. గిఫ్టుగా నిన్ను నాకు అర్పించుకో.. మహిళా సీఈవోతో ఎండీ

రక్షా బంధన్ రోజున ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. సాక్షాత్ ఓ మహిళా భాగస్వామి అయిన మహిళా సీఈవోను ఆ కంపెనీ ఎండీ తనతో గడపాలని కోరిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

Advertiesment
MD demand
, గురువారం, 18 ఆగస్టు 2016 (11:56 IST)
రక్షా బంధన్ రోజున ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. సాక్షాత్ ఓ మహిళా భాగస్వామి అయిన మహిళా సీఈవోను ఆ కంపెనీ ఎండీ తనతో గడపాలని కోరిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు తన పుట్టిన రోజు... బర్త్ డే గిఫ్టు కింద నిన్ను నాకు అర్పించుకో అంటూ లైంగికంగా వేధించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఓ హెల్త్ కేర్ కంపెనీ ఎండీగా బ్రిసీ జాన్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ కంపెనీ సీఈవోగా వ్యాపార భాగస్వామి అయిన ఓ మహిళ పని చేస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల 21వ తేదీన బ్రిసీ జాన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తన పుట్టిన రోజు కానుకగా ఒక రోజంతా తనతో గడపాలని, కంపెనీ కార్యాలయంతోపాటు లిఫ్టులోనూ ఎండీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు బర్త్ డే గిప్ట్ కింద తనకు రోజంతా సెక్స్ చేసేందుకు అనుమతించాలని కోరినట్లు బాధిత మహిళా సీఈవో బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన పోలీసులకు బాధిత మహిళ, జాన్ మంచి స్నేహితులని, వారు వ్యాపార పర్యటనల కోసం చెన్నై, త్రివేండ్రమ్ నగరాలకు సైతం వెళ్లి ఒకే హోటల్‌లో ఉన్నారని తేలింది. బాధిత మహిళకు భర్తతో వివాదం ఉండటంతో ఆమె జాన్‌తో కలిసి కంపెనీ పెట్టారని సమాచారం. అయినప్పటికీ మహిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు సెక్షన్ 354 (ఎ), 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడైన జాన్‌ను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైం చూసి సిద్ధూను దెబ్బతీసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్