వివాహం ఓ ఒప్పందం కాదు.. పవిత్ర కార్యం : ఢిల్లీ హైకోర్టు
వివాహం ఓ ఒప్పందం కాదనీ, ఓ పవిత్ర కార్యమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. తనను చట్టబద్ధంగా పెళ్లిచేసుకున్న భార్యగా ప్రకటించేందుకు నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేస
వివాహం ఓ ఒప్పందం కాదనీ, ఓ పవిత్ర కార్యమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. తనను చట్టబద్ధంగా పెళ్లిచేసుకున్న భార్యగా ప్రకటించేందుకు నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
ఢిల్లీలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో తన భర్త పారిశుద్ధ్య ఉద్యోగిగా పనిచేస్తూ మృతి చెందినందున కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని, తన భర్తకు లభించే ప్రయోజనాలను ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. అయితే, మృతి చెందిన వ్యక్తికి భార్య ఉండగానే ఈ మహిళ మళ్లీ అతన్ని రెండో పెళ్లి చేసుకున్నందున చట్టరీత్యా ఆ వివాహం చెల్లదని దిగువ కోర్టు తీర్పునిచ్చింది.
అయితే, తన వివాహానికి సంబంధించి వివాహ ధ్రువీకరణ, ప్రమాణ పత్రాలను ఆధారాలుగా చూపింది. అయితే అతనికి అంతకుముందే పెళ్లయిందని, మొదటి భార్య 1994 మే11న మరణించిందన్న విషయాన్ని వెల్లడించలేదు. దీంతో దిగువ కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించగా.. హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. హిందూ చట్టం కింద పెళ్లనేది పవిత్ర ఆచారమంటూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.