Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద నోట్లతో మావోలకు ఇక్కట్లు.. గ్రామ ప్రజల ద్వారా నోట్లు మార్చుకుంటున్నారు.. పోలీసుల వార్నింగ్

పెద్ద నోట్లతో మావోయిస్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. దీంతో పెద్ద నోట్ల మార్పిడీలో మావోలు కూడా బిజీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్

Advertiesment
Maoists Trying to Change Banned 500 1000 Rupees Notes
, ఆదివారం, 20 నవంబరు 2016 (15:42 IST)
పెద్ద నోట్లతో మావోయిస్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. దీంతో పెద్ద నోట్ల మార్పిడీలో మావోలు కూడా బిజీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో పెద్దనోట్లను పెద్ద ఎత్తున మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. 
 
స్థానిక గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా మార్చుకుంటున్నారని సమాచారం. వివిధ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.2.5లక్షల వరకు ఇచ్చి.. నగదు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. తమవద్ద దగ్గర పక్కా సమాచారముందని జార్ఖండ్‌లోని లేతహర్ జిల్లా ఎస్పీ వెల్లడించారు. 
 
బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమాచారం ఉందని తెలిపారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. అలాగే నోట్ల మార్పిడికి మావోయిస్టుల వలలో పడవద్దని పోలీసులు వ్యాపారులకు సూచించారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.
 
పెద్ద నోట్ల రద్దు కష్టాలు సమాజంలో మార్పు కోసం పోరాడుతున్న మావోయిస్టులకు కూడా తప్పడం లేదని, వారు ఆదివాసీలు, గిరిజనులను పట్టుకొని చెల్లని నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త నోటును స్కాన్ చేస్తే మోడీ ప్రసంగం కనిపిస్తుందా?: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..!