పాకిస్థాన్ పని పట్టాలి.. గడువుకు ముందే రాఫెల్ జెట్స్ ఇవ్వండి : మనోహర్ పారీకర్
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పని పట్టాల్సి ఉందని, అందువల్ల గడువుకు ముందే రాఫెల్ జెట్స్‌ను సమకూర్చాలని ఫ్రాన్స్‌ను భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కోరారు.
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పని పట్టాల్సి ఉందని, అందువల్ల గడువుకు ముందే రాఫెల్ జెట్స్‌ను సమకూర్చాలని ఫ్రాన్స్‌ను భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కోరారు. గత నెల 23వ తేదీన ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు మూడేళ్ల వ్యవధిలో ఆ దేశం ఈ అత్యాధునిక విమానాలను సరఫరా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ముందుగానే ఈ విమానాలను సమకూర్చాలని ఆయన కోరడం గమనార్హం.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లిన జవాన్ చందూ బాబూలాల్ చవాన్‌ను విడిపించడానికి సమయం పడుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మరోవైపు సర్జికల్ దాడులతో భారత శౌర్యం ప్రపంచం మొత్తానికీ తెలిసిందని, మన సైనికల పరాక్రమాన్ని చూసి దేశం గర్విస్తోందన్నారు.