Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళూరులో ఓ వ్యక్తికి నిఫా వైరస్.. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట?

మంగళూరులో ఓ వ్యక్తికి నిఫా వైరస్.. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట?
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:35 IST)
కేరళలో కలకలం సృష్టించిన నిఫా వైరస్ ఇప్పుడు కర్ణాటకకు వ్యాపించినట్టు తెలుస్తోంది. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు గుర్తించామని ఆ రాష్ట్ర హెల్త్ కమిషనర్ కేవీ తిలక్ చంద్ర తెలిపారు. బాధితుడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్ష కోసం పంపినట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తికి వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేవని, ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని తెలిపారు. 
 
బాధితుడు మంగళూరులోని ప్రభుత్వ వెన్లాక్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నట్టు అధికారి తెలిపారు. ఇటీవలే అతడు గోవాకు వెళ్లాడని.. కేరళకు చెందిన ఓ వ్యక్తితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందన్నారు. కేరళ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిని పరీక్షించాలని జిల్లా అధికారులకు ఇప్పటికే సూచించామన్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట మొదలైన లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ ఆదేశిస్తాడు... జగన్మోహన్ రెడ్డి పాటిస్తాడు...