కన్నబిడ్డపైనే లైంగిక దాడి.. మూడుసార్లు అబార్షన్ చేయించాడు.. బిడ్డకు జన్మనిచ్చింది..
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ కన్నతండ్రి సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఈ ఘటన
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ కన్నతండ్రి సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన నాటు వైద్యుడు (47) 2011లో తన భార్య చనిపోయిన నాటి నుంచి కన్నకూతురుపై (20) లైంగికదాడి చేశాడు. మూడుసార్లు అబార్షన్ చేశాడు. అయినా లైంగికదాడిని కొనసాగించడంతో బాధితురాలు ఇటీవల బిడ్డను ప్రసవించింది.
అతడి రెండోభార్య ఇటీవలే వదిలేసి వెళ్లిపోయింది. శుక్రవారం నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ కింద అతడిపై కేసులు నమోదు చేశారు.