ఆషాఢమంటూ భార్యను పుట్టింటికి పంపాడు.. ఆపై భార్య స్నేహితురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడు!
ఆషాఢ మాసం రావడంతో భార్యను పుట్టింటికి పంపాడు. ఇక పుట్టింటికి వెళ్లడంతో ఆ నవ వధువు తల్లిదండ్రులను చూసేందుకు వెళ్తున్నానని చెప్పి సంతోషంగా వెళ్లింది. భర్తను సమయానికి తినమంటూ చెప్పింది. అప్పుడప్పుడు అమ్మ
ఆషాఢ మాసం రావడంతో భార్యను పుట్టింటికి పంపాడు. ఇక పుట్టింటికి వెళ్లడంతో ఆ నవ వధువు తల్లిదండ్రులను చూసేందుకు వెళ్తున్నానని చెప్పి సంతోషంగా వెళ్లింది. భర్తను సమయానికి తినమంటూ చెప్పింది. అప్పుడప్పుడు అమ్మగారింటికి రమ్మని చెప్పి వెళ్లింది. అయితే ఆ సంతోషం వధువుకు చాలా రోజులు నిలవలేదు.
వివరాల్లోకి వెళితే.. పెళ్లి చేసుకున్న ఓ ఘనుడు ఆషాఢం కోసం పుట్టినింటికి భార్యను పంపి ఆమె స్నేహితురాలినే రెండో వివాహం చేసుకున్న సంఘటన మైసూరు జిల్లాలో వెలుగు చూసింది. కేఆర్ నగర్ నివాసి అనిల్ (27) జూన్‌లో కావ్యతో వివాహం జరిగింది. అంతలోనే ఆషాఢ మాసం రావడంతో కావ్య పుట్టింటికి వెళ్ళింది. పెళ్లిలో భార్య స్నేహితురాలిపై మనసు పారేసుకున్న అనిల్ ఈనెల2న భీముని అమావాస్య పండుగ నెపంతో భార్య ఇంటికి వెళ్లాడు.
ఆ తర్వాత ఊరికి వెళ్తానంటూ భార్యకు చెప్పి కావ్య స్నేహితురాలిని పిలిపించుకుని శివమొగ్గకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. సదరు యువతి తల్లిదండ్రులు గాలింపులు జరిపారు. చివరకు అనిల్ వెంట వెళ్ళినట్లు ద్రువీకరించుకుని శివమొగ్గకు చేరారు. అక్కడ తాళితో సహా ఉన్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. కావ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్జరుపుతున్నారు.