Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలిని దూరం చేశారు.. కాళ్లు పట్టిచ్చి అవమానం చేశారు.. ఆత్మహత్య చేసుకున్నాడు..

ప్రేమించాడు.. ప్రియురాలి కుటుంబ సభ్యుల వద్దకెళ్ళి పిల్లనివ్వమని చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రియురాలి కుటుంబ సభ్యులచే అవమానానికి గురయ్యాడు. దీంతో పాటు ప్రియురాలిని తన నుంచి దూరం చేశారని ఆవేదన, మనస్తాపం

Advertiesment
Man Made To Touch Lover's Feet; Allegedly Commits Suicide In Delhi
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:02 IST)
ప్రేమించాడు.. ప్రియురాలి కుటుంబ సభ్యుల వద్దకెళ్ళి పిల్లనివ్వమని చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రియురాలి కుటుంబ సభ్యులచే అవమానానికి గురయ్యాడు. దీంతో పాటు ప్రియురాలిని తన నుంచి దూరం చేశారని ఆవేదన, మనస్తాపంతో ఓ ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన న్యూఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార్‌కు చెందిన 25 ఏళ్ల యాగ్యా శరణ్ దత్‌కు స్థానికంగా నివాసముంటున్న ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగుతోంది. 
 
ప్రేమికులిద్దరూ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్ కు వెళ్లడం అమ్మాయి బంధువులు చూసి వారిని పోలీసుస్టేషనుకు తీసుకువెళ్లారు. యాగ్యా మేనమామతోపాటు అమ్మాయి తల్లిదండ్రులను పోలీసుస్టేషనుకు పిలిపించారు. పోలీసుస్టేషనులో ప్రియురాలి కాళ్లు పట్టిచ్చి అవమానించడమే కాకుండా ఇకముందు ఆమెను సోదరిగా చూడాలని అమ్మాయి కుటుంబసభ్యులు హుకుం జారీ చేశారు. దీంతో అవమానానికి గురైన మనస్తాపంతో యాగ్యా శరణ్ దత్ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రదాని నివాసం మారింది.. 7 రేస్‌కోర్స్ కాదు.. లోక్ కల్యాణ్‌మార్గ్