Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో పోలీసులు అవాక్కయ్యే కేసు.. భార్య మృతదేహంతో 3 రోజులు.. రంపంతో తలను వేరుచేసి?

ప్రేమికుల రోజున ఢిల్లీలో కోలాహలం నెలకొంటే.. పోలీసులు మాత్రం అవాక్కయ్యే కేసును కనుగొన్నారు. కట్టుకున్న భార్యన కడతేర్చిన ఓ కసాయి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో భయంకరమై

Advertiesment
ఢిల్లీలో పోలీసులు అవాక్కయ్యే కేసు.. భార్య మృతదేహంతో 3 రోజులు.. రంపంతో తలను వేరుచేసి?
, బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (09:15 IST)
ప్రేమికుల రోజున ఢిల్లీలో కోలాహలం నెలకొంటే.. పోలీసులు మాత్రం అవాక్కయ్యే కేసును కనుగొన్నారు. కట్టుకున్న భార్యన కడతేర్చిన ఓ కసాయి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో భయంకరమైన నిజాలు బయటికొచ్చాయి. ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మధు విహార్‌ అనే ప్రాంతంలో సుబోధ్‌ కుమార్‌ (40) అనే వ్యక్తి మనీషా భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
ఇటీవలే భార్యకు తెలియకుండా సుబోధ్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మునియా. రెండు ఫ్యామిలీలు నడపాలన్న కుట్ర చేసినా చివరికి అది బయటపడటంతో సుబోధ్‌ను భార్య మనీషా నిలదీసింది. ఈ విషయంపై ఇటీవల తరుచు వారిమధ్య గొడవలు జరిగాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్య సుబోధను అడిగింది. అయితే భార్యను హింసించడం మొదలెట్టాడు. పిల్లల ముందే భార్యను కొట్టేవాడు. 
 
పిల్లలను ముందుగానే తన అత్తమామ వద్దకు పంపించి తన భార్యను చంపే కుట్ర రచించాడు. శనివారం రాత్రి ఆమెపై పైపు దాడి చేసి పదేపదే తలపై కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లే వీలుకాక రంపాన్ని తెచ్చి ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు. 
 
ఆయా సంచుల్లో ఆమె దేహాన్ని ముక్కలు చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే, అప్పటికే మూడు రోజులు కావడంతో దుర్గంధం వచ్చి చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోసిపోయిన అమ్మ నివాసం వేదనిలయం... ఇక స్మారక మందిరం!