పొరుగింటి కుక్కపై ఓ వ్యక్తి కర్కకశంగా వ్యవహరించాడు. మొరుగుతుందనే కారణంతో శునకం ప్రైవేటు భాగంలోకి ఐరన్ రాడ్‌ను చొప్పించాడు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు పేరు చందన్ నాయక్ అని చెప్పారు.
కుక్కపై దాడి చేయడానికి నిందితుడు చందన్ నాయక్‌కు అతడి తండ్రి సహకరించాడు. దాడికి ముందు కుక్క యజమాని ఇంటి ముందుకెళ్లి తండ్రీకొడుకులిద్దరూ పెద్దపెద్ద కేకలు వేశారు. సదరు మహిళను జుట్టుపట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు.
బట్టలన్నీ చింపివేసే ప్రయత్నం చేశారు. ఆమెపై అత్యాచారానికి కూడా ప్రయత్నించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న శునకం మరింత గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. దీంతో చందన్ నాయక్ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.
ఐరన్ రాడ్‌ను శునకం ప్రైవేటు భాగాల్లోకి చొప్పించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది.