Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తను వదిలి ప్రియుడి చెంతకొచ్చిన ప్రియురాలు.. ప్రేమికులను గొంతుకోసి చంపేశారు...

రెండు నెలల క్రితం కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ వివాహిత తాను ప్రేమించిన ప్రియుడి చెంతకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ప్రేమికులిద్దరినీ పట్టుకుని గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసు

Advertiesment
భర్తను వదిలి ప్రియుడి చెంతకొచ్చిన ప్రియురాలు.. ప్రేమికులను గొంతుకోసి చంపేశారు...
, సోమవారం, 24 జులై 2017 (12:08 IST)
రెండు నెలల క్రితం కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ వివాహిత తాను ప్రేమించిన ప్రియుడి చెంతకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ప్రేమికులిద్దరినీ పట్టుకుని గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహారాష్ట్ర భోకర్‌ తాలుకా కేర్బాన్‌ గ్రామానికి చెందిన పూజ(21) అనే యువతికి రెండు నెలల క్రితం పెద్దలు కుదిర్చిన యువకుడితో పెళ్లి జరిగింది. అయితే, పూజకు పెళ్లి కాకముందే అదే గ్రామానికి చెందిన కరాటే గోవింద్ (26) అనే యువకుడిలో పడింది. 
 
ఈ నేపథ్యంలో పెద్దల ఒత్తిడికి తలొగ్గి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ.. అతనితో కాపురం చేయలేకపోయింది. దీంతో రెండు రోజుల క్రితం తన సొంత గ్రామమైన కేర్బాన్‌ గ్రామానికి వచ్చిన పూజ ప్రియుడు గోవింద్‌(26)తో కలిసి స్వగ్రామం నుంచి పారిపోయారు. దీంతో పూజ కుటుంబీకులు మహారాష్ట్ర భోకర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పూజ సోదరుడు దిగంబర్ వారిని వెంటాడి పట్టుకుని స్వగ్రామానికి తీసుకెళుతూ మహారాష్ట్ర సరిహాద్దు నిగ్వా గ్రామ సమీపంలో వారిద్దరి గొంతు కోసి హత్యచేశాడు. అనంతరం భోకర్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు విషయాన్ని తెలియజేసి లొంగిపోయాడు. మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీంనగర్‌లో వ్యభిచారం : సండే పార్టీ పేరుతో ఓ యువతి.. ఐదుగురు విటుల ఎంజాయ్