అమిత్ షా ఇంటిపై ఐటీ దాడి చేయదేం... మోహన్ రావుపై ఐటీ దాడి అనైతికం: మమత
తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్
తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఇంటిపై ఎందుకు చేయడంలేదు అని ప్రశ్నించారు.
గతంలో కూడా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపైన ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసి వేధించిందని గుర్తు చేశారు. ఇలాంటి వారిపై ఐటీ దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుంటున్న అమిత్ షాపై ఐటీ శాఖ ఎందుకు దృష్టి సారించడంలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో నిలదీస్తామని ఆమె అన్నారు.