Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార్షిక సార్థి అభియాన్‌ను కొనసాగిస్తున్న మహీంద్రా: ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు కొత్తగా 1,000 స్కాలర్‌షిప్‌లు

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (20:07 IST)
మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్, డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని తమ మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల కోసం స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ట్రక్ డ్రైవర్ల ప్రతిభావంతులైన కుమార్తెలు, పైచదువులు చదివేందుకు తోడ్పడటం ద్వారా వారి జీవితాల్లో పరివర్తన తెచ్చే దిశగా ఈ ప్రాజెక్టు ద్వారా కొంత సహాయం అందించేందుకు మహీంద్రా కట్టుబడి ఉంది.
 
ఎంపికైన అభ్యర్ధులకు గుర్తింపు సర్టిఫికెట్‌ ఇవ్వడంతోపాటు రూ. 10,000 స్కాలర్‌షిప్‌తో సత్కరించే ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా. 2014లో ప్రారంభమైన మహీంద్రా సార్థి అభియాన్ కింద ట్రక్ డ్రైవర్ల కమ్యూనిటీ శ్రేయస్సుకు తోడ్పడే దిశగా మహీంద్రా ట్రక్ అండ్ డివిజన్ చేస్తున్న కృషిలో ఇది మరొక మైలురాయి. పారదర్శకమైన, స్పష్టంగా నిర్వచించబడిన, స్వతంత్ర ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 75 పైచిలుకు ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఆకాంక్షలకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద ఇప్పటివరకు 10,029 మంది ప్రయోజనం పొందారు.
 
“మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా మేము స్కాలర్‌షిప్‌లను మాత్రమే అందించడం లేదు, యువ హృదయాల్లో ఆశలు నింపి, వారి ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరుస్తున్నాం. ట్రక్ డ్రైవర్ భాగస్వాముల కుమార్తెలకు చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా జీవితాల్లో పరివర్తన తెచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాం. వారి భవిష్యత్తుపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సాధికారత కలిగిన మహిళలకు సంబంధించి ఒక తరాన్ని సృష్టించేందుకు దోహదపడుతున్నాం. వారు మన కమ్యూనిటీలు అలాగే ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడగలరు” అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్ (ట్రక్స్, బసెస్, సీఈ, ఏరోస్పేస్ & డిఫెన్స్ బిజినెసెస్), మహీంద్రా గ్రూప్‌ యొక్క గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు Mr. వినోద్ సహాయ్ తెలిపారు.
 
“మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా మేము నిలకడగా చేస్తున్న కృషి కేవలం ట్రక్ డ్రైవర్ల కుమార్తెల జీవితాలను మెరుగుపర్చడానికి మాత్రమే కాకుండా కొత్త అవకాశాలు మరియు ప్రేరణపరమైన సంస్కృతిని పెంపొందించేందుకు దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము కమర్షియల్ వాహన విభాగంలో మరింత మంది మహిళలను చూడదల్చుకుంటున్నాం. వారి భవిష్యత్తుపై ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రతి అమ్మాయి తన ఆకాంక్షలను నెరవేర్చుకోగలిగేలా, రేపటి నాయకులుగా ఎదగగలిగేలా అవకాశాలుండే పటిష్టమైన మరియు సమసమాజాన్ని సాధించే దిశగా కృషి చేస్తున్నాం” అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) Mr. జలజ్ గుప్తా చెప్పారు.
 
ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన ప్రతి బాలిక బ్యాంకు ఖాతాలోకి నేరుగా రూ. 10,000 మొత్తాన్ని కంపెనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అలాగే ఈ ఘనతను సాధించినందుకు గుర్తింపుగా సర్టిఫికెట్ అందిస్తుంది. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నిర్దిష్ట లొకేషన్లలో మహీంద్రా ట్రక్ అండ్ బస్ నాయకత్వం, ఈ పురస్కార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వాటిలో ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు 1,000 స్కాలర్‌షిప్‌లు అందజేయబడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!