పట్టాలు తప్పిన రైలు.. పక్కకు ఒరిగిన 8 బోగీలు: యూపీలో ఘోరప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని మబోబా జిల్లా సమీపంలో మహాకోసల్ ఎక్స్‌ప్రెస్ ఘోరప్రమాదానికి గురైంది. గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగి పోయాయి. హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) నుంచి జబల్పూర్ (మధ్యప్రదేశ్) వెళుతుండగా రైలు ప్రమాదానికి గురైం
ఉత్తరప్రదేశ్‌లోని మబోబా జిల్లా సమీపంలో మహాకోసల్ ఎక్స్‌ప్రెస్ ఘోరప్రమాదానికి గురైంది. గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగి పోయాయి. హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) నుంచి జబల్పూర్ (మధ్యప్రదేశ్) వెళుతుండగా రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వివరాలు స్పష్టం కాలేదు కానీ సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. సీనియర్ అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం.
గత మూడునెలల్లో రైలు ప్రమాదాలు వరుసగా జరగటంతో ఉగ్రవాదుల కుట్రగా మొదట ఆరోపించిన కేంద్ర ప్రభుత్వం సురక్షిత రైలు ప్రయాణాలకు హామీ ఇవ్వడం కోసం కొరియా, జపాన్ వంటి దేశాల రైల్వే సంస్థల అధికార్లను ఆహ్వానించింది. ట్రాక్ సర్క్యూట్ విఫలమైన సందర్భాల్లో రైలు వేగాన్ని నియంత్రించాలని, డబుల్ చెక్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని, కొరియన్ రైల్వే నిపుణులు సూచించారు కూడా. కాని అవి ఆచరణలోకి వచ్చేసరికి ఇలాంటి ప్రమాదాలను దేశం చూడాల్సి ఉంటుంది.