Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

మదురై కాలేజీ అమ్మాయిలతో వ్యభిచార గుట్టు రట్టు

Advertiesment
Madurai
, మంగళవారం, 12 మే 2020 (17:03 IST)
మధురై కాలేజీలో చదువుతున్న అమ్మాయిలను లొంగదీసుకుని.. వారిచేత వ్యభిచారం చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందమైన కాలేజ్ అమ్మాయిలను లొంగదీసుకుని వారికి కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి వారి నగ్న వీడియోలు తీస్తూ వారిని వ్యభిచారం కూపంలోకి దింపుతున్నారు.

వారి వీడియోలు అమ్ముకుంటోన్న గ్యాంగ్ గుట్టును మధురై పోలీసులు రట్టు చేశారు. ఓ హైటెక్ వ్యభిచార దందా వెనక ఓ మొబైల్ షాప్ యజమాని, హైటెక్ రెస్టారెంట్ ఓనర్ ఉన్నారని పోలీసులు తెలిపారు.
 
మధురైలోని ఓ కాలేజ్ విద్యార్థినులు మొబైల్ షాప్‌లో రీజార్జ్‌కు వెళ్లేవారు. ఆ షాపు యజమాని, మరో రెస్టారెంట్ ఓనర్ కలిసి వాళ్ల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ట్రాప్ చేయడం మొదలు పెట్టారు. తాము చెప్పినట్లు వింటే కావాల్సినంత డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. లగ్జరీ లైఫ్ గడపవచ్చని చెప్పారు.

ఇంకా అందమైన కాలేజ్ అమ్మాయిలను లొంగదీసుకుని వారికి కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి వారి నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడేవారు. ఇందులో భాగంగా లాక్ డౌన్ వేళ పదే పదే అమ్మాయిలు హాస్టల్‌, కాలేజ్ నంచి బయటకు వెళ్లి వస్తున్నారు. దీంతో పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.
 
చివరకు ఓ విద్యార్థిని ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ కాలేజ్ విద్యార్థినిలపై మాటు వేసి ఉంచారు. ఒక్క ఫోన్ నెంబర్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరాయి మగాడితో పడకసుఖం.. భర్తను చంపి ఇసుకలో పాతిపెట్టిన భార్య!