Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యోగా నేర్చుకునేందుకే వచ్చాం.. కానీ ఇష్టపడి సన్యాసం స్వీకరించాం : గీతా, లత

కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌కు యోగా శిక్షణార్థం వెళ్లిన ఇద్దరు యువతులు సన్యాసినులుగా మారారు. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆ ఇద్దరు యువతుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశం మేరకు ప

యోగా నేర్చుకునేందుకే వచ్చాం.. కానీ ఇష్టపడి సన్యాసం స్వీకరించాం : గీతా, లత
, గురువారం, 11 ఆగస్టు 2016 (13:34 IST)
కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌కు యోగా శిక్షణార్థం వెళ్లిన ఇద్దరు యువతులు సన్యాసినులుగా మారారు. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆ ఇద్దరు యువతుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశం మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువతులైన గీతా, లతలు పోలీసుల సమక్షంలో మీడియా ముందుకు వచ్చారు. 
 
ఈషా యోగా సెంటర్‌లో ఎవరి ఒత్తిళ్లకు లొంగిపోయి తాము సన్యాసం స్వీకరించలేదని సత్యజ్యోతి కుమార్తెలైన గీతా, లతా తెలిపారు. దీనిపై వారిద్దరు కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లో మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులు అనవసరంగా తమపైనా, యోగా సెంటర్‌ నిర్వాహకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమను ఎవరూ సన్యాసం తీసుకోమంటూ బలవంతపెట్టలేదని స్పష్టం చేశారు.
 
ఇదిలావుండగా, ఈషా యోగా కేంద్రంలో ఇద్దరు యువతులను సన్యాసినులుగా మార్చిన సంఘటనపై జిల్లా మేజిస్ట్రే‌ట్‌ విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కోయంబత్తూరు జిల్లాకు చెందిన సత్యజ్యోతి అనే మహిళ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు నాగముత్తు, భారతిదాసన్‌లు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 
 
సత్యజ్యోతి కుమార్తెలు గీతా, లతా ఆ యోగా సెంటర్‌లో శిక్షణ కోసం చేరారు. వారి తల్లిదండ్రులు యోగా సెంటర్‌కు వెళ్లి కుమార్తెలను కలుసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడాదిపాటు ఆ ఇద్దరు యువతులను తల్లిదండ్రులు కలుసుకునేందుకు అనుమతించలేదు. సత్యజ్యోతి తన కుమార్తెలను గురించి యోగా సెంటర్‌లో వాకబు చేయగా ఆ ఇద్దరు యువతులకు యోగాకేంద్రం నిర్వాహకులు గుండుగీయించి వారిని సన్యాసినులుగా మార్చినట్టు తెలుసుకున్నారు. 
 
దీంతో తమ కుమార్తెలను కోర్టులో హాజరుపరిచేవిధంగా ఉత్తర్వులివ్వాలని సత్యజ్యోతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయమూర్తులు కోయంబత్తూరు జిల్లా జడ్జి, డీఎస్పీలు కోవైలోని ఈషా యోగా సెంటర్‌కు వెళ్ల అక్కడ వారికి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా సత్యజ్యోతి కుమార్తెలు గీతా, లతను కలుసుకుని వారి వద్ద వాంగ్మూలాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతిది పరువు హత్యా? బిలాల్‌ని స్వాతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందా? బాబాయే హత్యకు కారణమా?