Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూనిఫాం లేకుండా నిలబెట్టిన ఉపాధ్యాయుడి సస్పెండ్

teacher uniform wash
, ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:31 IST)
తాను ఒకటి తలస్తే దేవం మరొకటి తలచిందంటూ ఇదే కాబోలు. ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడ్డారు. మాసిన యూనిఫాంతో వచ్చిన విద్యార్థిని యూనిఫాం విప్పంచి స్వయంగా ఉతికి ఆరేసాడు. ఆ బట్టులు ఆరేంత వరకు ఆ  బాలికను దుస్తులు లేకుండానే నిలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో విద్యాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శహదోల్ జిల్లా జైసింగ్ నగరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైసింగ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఓ గిరిజన బాలిక ఐదో తరగతి చదువుతోంది. పూర్తిగా మాసిన యూనిఫాంతో స్కూలుకు వచ్చిన బాలికను చూసిన ఉపాధ్యాయుడు శ్రావణ్ కుమార్ త్రిపాఠి.. బాలిక యూనిఫాంను విప్పించి స్వయంగా ఉతికి శుభ్రం చేశాడు. 
 
ఇంతవరకుబాగానే వుంది. యూనిఫాం ఉతికి, అది ఆరేంత వరకు బాలిక అలాగే దుస్తులు లేకుండానే నిల్చోబెట్టాడు. యూనిఫాం ఆరిన తర్వాత తొడుక్కున్నాక కానీ బాలిక తరగతి గదిలోకి వెళ్లలేదు. అక్కడితో ఊరుకున్నా అయిపోయేది. కానీ, ఆ ఉపాధ్యాయుడు తాను యూనిఫాం ఉతుకుతుండగా ఫొటో తీయించి దానిని విద్యాశాఖ గ్రూపులో షేర్ చేశాడు. 
 
పరిశుభ్రతకు తాను ప్రాణం ఇస్తానని అందులో రాసుకొచ్చాడు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ వందనా వైద్య స్పందించారు. అమ్మాయిని దుస్తులు లేకుండా నిలబెట్టి యూనిఫాం ఉతికిన ఘటనపై విచారణ జరిపించి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు శహదోల్ ట్రైబల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ రాయ్ సిన్హా ఆ తర్వాత నిర్ధారించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీంనగర్‌లో ఒగ్గు కథ షో ద్వారా కల్తీ చేసిన లూజ్‌ టీ పొడి పట్ల అవగాహన కార్యక్రమం