దారుణం... 8 ఏళ్ల బాలుడు పొట్టలో దిగబడిన ఎండుకొమ్మ...

గురువారం, 10 జనవరి 2019 (21:09 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ బాలుడు చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఓ ఎండు కొమ్మ అతడి పొట్టలో దిగబడిపోయింది. ఇలాంటి ఘటన జరిగితే ఎవరైనా అక్కడే కుప్పకూలిపోతారు. కానీ ఆ బాలుడు ఎంతో ధైర్యంతో ఘటనా స్థలం నుంచి పొట్టలో దిగిబడి వున్న కట్టెతోనే ఇంటికి వచ్చాడు. అతడిని ఆ పరిస్థితిలో చూసిన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు.
 
అతడి పొట్టలో దిగబడిన ఎండు కట్టెను జాగ్రత్తగా బయటకు తీశారు వైద్య బృందం. ఐతే అతడి కాలేయానికి, ఊపిరితిత్తులకు ఎండుకట్టె గాయం చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని అత్యవసర చికిత్స విభాగంలో వుంచి పర్యవేక్షిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ కుమారుడు - లక్ష్మీపార్వతి