Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్లిక్ పార్కులో ప్రేమజంట... కేరళ పోలీసుల జులుం... ఏం చేశారో వీడియో చూడండి

సాధారణంగా ప్రేమికులకు సేదతీరేందుకు ఉండే ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి పార్కు. మరొకటి బస్టాఫ్. ఏకాంతంగా గడపాలని భావించిన ప్రేమికులు పార్కులకు వెళుతుంటారు. అయితే ఈ మధ్య కొందరు ప్రేమికులు పార్కుల్లో అసాంఘిక

పబ్లిక్ పార్కులో ప్రేమజంట... కేరళ పోలీసుల జులుం... ఏం చేశారో వీడియో చూడండి
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:40 IST)
సాధారణంగా ప్రేమికులకు సేదతీరేందుకు ఉండే ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి పార్కు. మరొకటి బస్టాఫ్. ఏకాంతంగా గడపాలని భావించిన ప్రేమికులు పార్కులకు వెళుతుంటారు. అయితే ఈ మధ్య కొందరు ప్రేమికులు పార్కుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం. అయితే అందరు ప్రేమికులు అలా ఉంటారని కూడా చెప్పలేం. కొందరు లవర్స్ కాలక్షేపం కోసం పార్కులకు వెళుతుంటారు. అలా వెళ్లిన వారితో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తిరువనంతపురంలోని ఓ పబ్లిక్ పార్క్‌కు విష్ణు, ఆర్తి అనే ఇద్దరు ప్రేమికులు వచ్చారు. వారిద్దరూ వెళ్లి ఓ దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకుంటునమ్నారు. వారివద్దకు ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు. ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారు. వెంటనే విష్ణు ఫేస్‌బుక్‌లో ఉన్న లైవ్ ఆప్షన్‌ను క్లిక్ చేశాడు. జరిగిన వ్యవహారాన్నంతా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. 
 
పోలీస్ స్టేషన్‌కు ఎందుకు రావాలని ప్రశ్నించాడు. పబ్లిక్ పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినందుకు మీ ఇద్దరినీ స్టేషన్‌కు తరలిస్తామని లేడీ కానిస్టేబుల్స్ చెప్పారు. మీ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చేరవేస్తామని బెదిరించారు. తాము ఏ దుశ్చర్యకు పాల్పడ్డామో చెప్పాలని, ముద్దు పెట్టుకున్నామా, కౌగిలించుకున్నామా, పబ్లిక్‌తో అసభ్యంగా ప్రవర్తించామో చెప్పాలంటూ లవర్స్ పోలీసులపై ఫైరయ్యారు. కెమెరాలున్నాయి కదా... ఏం తప్పు చేశామో చూపించాలని ప్రశ్నించారు.
 
లవర్స్ రివర్స్‌ అవ్వడంతో ఆ మహిళా కానిస్టేబుల్స్‌కు నోట మాట రాలేదు. పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేశారని, అందుకు రూ.200 ఫైన్ కట్టాలంటూ పట్టుబట్టారు. అందుకు కూడా ఆ ప్రేమ జంట ఒప్పుకోలేదు. తాము ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఫైన్ ఎందుకు కట్టాలని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు వాగ్వాదానికి దిగడంతో ఎట్టకేలకు ప్రేమ జంట దిగొచ్చింది. ఫైన్ స్లిప్‌పై సంతకం చేసి... పోలీస్ జీప్ ఎక్కారు. జీప్‌లో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలో పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, చేయని తప్పుకు కూడా స్టేషన్‌కు రమ్మని పిలుస్తున్నారని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశం ఆరో సంపన్నదేశం... హైదరాబాద్‌లో 9000 మంది మిలయనీర్లు, ఏపీ సంగతేంటి?