Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

Advertiesment
Love letter

సెల్వి

, గురువారం, 6 మార్చి 2025 (19:57 IST)
Love letter
కర్ణాటకలోని చిక్క తిరుపతి ఆలయంలో ఒక మహిళ తన ప్రేమను నెరవేర్చమని కోరుతూ ఓ లవ్ లెటర్ రాసింది. అధికారులు ఆలయ హుండీలో డబ్బును లెక్కిస్తుండగా ఈ లేఖ దొరికింది. సాధారణంగా ఆలయ హుండీల్లో భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. కొంతమంది డబ్బు, బంగారం, వెండి కానుకలు కూడా సమర్పిస్తారు. అయితే, కర్ణాటకలో ఒక మహిళ ప్రేమలేఖను హుండీలో వేసింది. ఆ లేఖలో "దేవా, నన్ను, నా ప్రేమికుడిని త్వరలో కలపండి" అంటూ రాసింది. ఈ లేఖ రాసిన మహిళ చిక్క తిరుపతి ఆలయం కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతమైన లక్కూర్ హోబ్లిలో ఉంది. 
 
ఈ ఆలయానికి చిన్న తిరుపతి అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడకు వస్తారు. ఇంకా మొక్కులుస కానుకలు చెల్లిస్తుంటారు. అలా హుండీలో వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తుండగా అధికారులకు ఓ లేఖ దొరికింది. 
 
ఆ మహిళ రాసిన లేఖలో, "ఓ దేవా, దయచేసి నన్ను, నా ప్రేమికుడిని త్వరగా కలపండి" అని అభ్యర్థించింది. ఇంకా  తన లేఖలో తన ప్రేమికుడు తనను విడిచిపెట్టకూడదని, తనను ఇంకా ఎక్కువగా ప్రేమించాలని" కోరుకుంది. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..