తాగమంటూ కన్నబిడ్డ నోట్లో బీరు పోసిన తండ్రి: సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఓ తాగుబోతు తండ్రి తన పిల్లాడికి తప్ప తాగించిన దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాను చెడింది కాకుండా బిడ్డను కూడా వదలని ఆ తండ్రిపై తగిన చర్యలు తీసుకోవాలని
ఓ తాగుబోతు తండ్రి తన పిల్లాడికి తప్ప తాగించిన దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాను చెడింది కాకుండా బిడ్డను కూడా వదలని ఆ తండ్రిపై తగిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు సమీపంలోని ఓ గ్రామంలో చెట్టుకింద కూర్చున్న ముగ్గురు యువకులు తప్ప తాగుతూ మూడేళ్ల చిన్నారిని మందు తాపించిన వీడియో బయటికొచ్చింది. దీంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఓ తండ్రి తన కన్నబిడ్డ నోట్లో బీర్ బాటిల్ పెట్టి తాగు తాగు అంటూ.. ఒత్తిడి చేశాడు. ఆ పిల్లాడు తాగలేక కక్కుకుంటే.. ''చూడు బాబూ నాన్న ఎలా తాగుతున్నాడో.." అంటూ తన నోట్లో పోసి మరీ చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి ప్రమాదకర ఘటనలకు బ్రేక్ వేసే దిశగా తమిళనాడు, పాండిచ్చేరీల్లో మద్యంపై పూర్తిగా నిషేధం విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.