Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్వానీకి ఆ యోగం కూడా లేనట్టేనా...? మధ్యలో అడ్డొస్తున్న 'ద్రౌపది'

ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ఖాయం అనుకున్నారంతా... కానీ అనుకోవడం వరకే కానీ కార్యరూపం దాల్చేందుకు చాలా లెక్కలు అడ్డొస్తుంటాయి. ఇది నిజం. మనం కూడా అవి జరుగుతాయ్... ఇవి జరుగుతాయ్ అనుకుంటాం కానీ మనకు తెలియన

అద్వానీకి ఆ యోగం కూడా లేనట్టేనా...? మధ్యలో అడ్డొస్తున్న 'ద్రౌపది'
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (12:23 IST)
ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ఖాయం అనుకున్నారంతా... కానీ అనుకోవడం వరకే కానీ కార్యరూపం దాల్చేందుకు చాలా లెక్కలు అడ్డొస్తుంటాయి. ఇది నిజం. మనం కూడా అవి జరుగుతాయ్... ఇవి జరుగుతాయ్ అనుకుంటాం కానీ మనకు తెలియనివి ఏవేవో జరిగిపోతుంటాయి. మనం అనుకున్నవి జరిగేందుకు టైం పట్టవచ్చు. అసలు జరగకుండానే పోవచ్చు. 
 
భాజపా కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ విషయంలోనూ ఇదే జరుగుతోందంటున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ప్రణబ్ ముఖర్జీ తర్వాత ఆయన ప్లేస్‌లో అద్వానీ ఖాయం అనుకున్నారంతా. కానీ ఆ పరిస్థితి కనబడటం లేదంటున్నారు.
 
భాజపా హైకమాండ్ రాష్ట్రపతిగా ఎంపిక చేస్తున్న అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు లేదట. ఈ లిస్టులో మురళీమనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది పేర్లు ఉన్నట్లు సమాచారం. భాజపా అధికారంలోకి వస్తే అద్వానీయే రాష్ట్రపతి అని అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తమ్మీద ఈ ప్రచారానికి పదును లేదని తాజా ప్రచారం చెపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్ నరసింహన్ రొట్టె విరిగి నేతిలో పడిందా...? ఉపరాష్ట్రపతిగా నరసింహన్...?