Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద మొసళ్లు బతికిపోయి, చిన్న చేపలు చచ్చిపోయాయి.. నోట్ల రద్దుపై అట్టుడికిన రాజ్యసభ..

నోట్ల రద్దుపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నోట్ల రద్దుపై రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. ఎంపీలు మాయావతి,

Advertiesment
పెద్ద మొసళ్లు బతికిపోయి, చిన్న చేపలు చచ్చిపోయాయి.. నోట్ల రద్దుపై అట్టుడికిన రాజ్యసభ..
, గురువారం, 17 నవంబరు 2016 (12:06 IST)
నోట్ల రద్దుపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నోట్ల రద్దుపై రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. ఎంపీలు మాయావతి, శరద్ యాదవ్, ఆనంద్ శర్మ, సీతారాం ఏచూరి తదితరులు బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు.  ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద మొసళ్లు బతికిపోయి, చిన్న చేపలు చచ్చిపోయాయని వ్యాఖ్యానించారు.
 
86 శాతం నగదు లావాదేవీలు జరిగే భారత దేశంలో నగదు రహిత విధానం అసాధ్యమన్నారు. నల్లధనంపై పోరుకు మద్దతిస్తామని.. అయితే పెద్ద నోట్ల రద్దు పేరిట ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండబోమని విపక్ష నేతలు మండిపడ్డారు. నగదు రహిత విధానం భారత దేశానికి సరిపడదని, అన్నిపనులు ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటే సామాన్యుల పరిస్థితి ఏంటిని నిలదీశారు. 
 
పెద్దనోట్లతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని అడిగారు. పంట ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయని. హైవేలపై రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయిందని విమర్శించారు. దేశంలో 90 శాతం నల్లధనం పన్నుల ఎగవేత సొమ్మేనని, నల్లధనం నియంత్రించడానికి నోట్లు రద్దే మార్గమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంతో సభ్యులు శాంతించకపోవడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ ఇండియా భోజనంలో బొద్దింక.. ఎయిర్‌లైన్స్ బొద్దింకలతో కూడిన శాకాహారం ఇస్తుందని?