Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మందు బాబులకు లిక్కర్ పాసులు: కేరళ ప్రభుత్వం

మందు బాబులకు లిక్కర్ పాసులు: కేరళ ప్రభుత్వం
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:12 IST)
లాక్​డౌన్​ వేళ మందు బాబులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. మద్యం లేక ఒత్తిడికి లోనవుతున్నవారికి 'లిక్కర్​ పాస్​'లు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ఈ నిర్ణయాన్ని భారతీయ వైద్య సంఘం వ్యతిరేకించింది. 21 రోజుల లాక్​డౌన్​ కారణంగా యావత్​ భారతం బంద్ అయ్యింది. మద్యం దుకాణాలూ మూతబడ్డాయి. దీంతో మందు చుక్క లేక విలవిల్లాడుతున్నారు జనం.

వారి బాధను అర్థం చేసుకుని మందుబాబుల గొంతుతడిపే ప్రయత్నం చేస్తోంది కేరళ ప్రభుత్వం. మందు లేక బతకలేమన్నవారికి ప్రత్యేక 'లిక్కర్​ పాస్'​లు ఇవ్వాలని నిర్ణయించింది.

కేరళలో మద్యం దాహం తాళలేక ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం వైద్యులు సూచిస్తే తాగుబోతులకు మందు విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే 2 వారాల్లో 2.40 లక్షల మంది చనిపోవచ్చు : వైట్‌హౌస్ అంచనా