Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. 15 రోజుల్లోనే తీర్పు.. ఐదేళ్ల జైలుశిక్ష.. పదివేల జరిమానా

దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేసులు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. అయితే ఓ బాలికపై యాభై ఏళ్ల కామాంధుడు అత్యాచారం జరిపిన కేసుపై అతి త్వరలో తీర్పు రావడంపై సర్వత్రా ప్రశంసల

బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. 15 రోజుల్లోనే తీర్పు.. ఐదేళ్ల జైలుశిక్ష.. పదివేల జరిమానా
, బుధవారం, 21 డిశెంబరు 2016 (12:56 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేసులు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. అయితే ఓ బాలికపై యాభై ఏళ్ల కామాంధుడు అత్యాచారం జరిపిన కేసుపై అతి త్వరలో తీర్పు రావడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని కోర్టుల్లో లక్షలాది కేసుల విచారణ పెండింగులోనే ఉండగా... బాలికపై రేప్ కేసులో బెంగాల్ జడ్జి మెరుపువేగంతో సంఘటన జరిగిన 15 రోజుల్లోనే తీర్పు వెలువరించి న్యాయవ్యవస్థ మెరుపు వేగాన్ని సమాజానికి చాటి చెప్పారు.
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియా జిల్లా కృష్ణనగర్ కు చెందిన బిజోన్ సిల్ అనే 50 ఏళ్ల వ్యక్తి క్షురకుడిగా పనిచేస్తున్నాడు. సిల్ ఎనిమిదేళ్ల బాలిక తాతకు గత కొంతకాలంగా ఇంటికొచ్చి షేవింగ్ చేసేవాడు. అలా వచ్చిన బిజోన్ సిల్‌కు బాలిక ఒంటరిగా కనిపించడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు విని పొరుగింటి వారు సిల్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఈ నెల డిసెంబర్ ఆరో తేదీన చోటుచేసుకోగా, డిసెంబరు 9వ తేదీన చార్జిషీటులో ఐపీసీ సెక్షన్ 376 (2) (ఐ) పోస్కో చట్టాలను నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు దోషికి ఐదేళ్ల కారాగార శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ ఈ నెల 19వతేదీన జడ్జి తీర్పు నిచ్చారు.
 
దోషి జరిమానా చెల్లించకుంటే మరో మూడునెలలపాటు జైలు శిక్ష పొడిగించాలని తీర్పులో జడ్జీ పేర్కొన్నారు. రేప్ సంఘటన జరిగిన 15 రోజుల్లోనే తీర్పు వెలువరించిన జడ్జీతోపాటు ప్రాసిక్యూషన్ ను కోల్ కతా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కౌన్సెల్ శ్యామలఘోష్ అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో దారుణం.. యువతిని కాల్చేసిన స్నేహితుడు.. హోటల్, షాపింగ్‌కు తీసుకెళ్లి... ఇంటిముందే?