Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దాయనా కథ ముగిసిపోయింది, బాబును ఆశీర్వదించు అన్న లాలూ

సమాజ్‌వాదీ పార్టీలో చీలికను, తండ్రీ కొడుకుల మధ్య తీరని తగవును చివరివరకు తెంచాలని ప్రయత్నించి ఓడిపోయిన రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. అఖిలేష్ బాబును ఆశీర్వదించు అంటూ ములాయం సింగి యాదవ్‌కు సలహా ఇచ్చాడు.

పెద్దాయనా కథ ముగిసిపోయింది, బాబును ఆశీర్వదించు అన్న లాలూ
హైదరాబాద్ , మంగళవారం, 17 జనవరి 2017 (06:03 IST)
సమాజ్‌వాదీ పార్టీలో చీలికను, తండ్రీ కొడుకుల మధ్య తీరని తగవును చివరివరకు తెంచాలని ప్రయత్నించి ఓడిపోయిన రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. అఖిలేష్ బాబును ఆశీర్వదించు అంటూ ములాయం సింగి యాదవ్‌కు సలహా ఇచ్చాడు. ఎన్నికల కమిషన్ ఎస్పీ అధికారిక సింబల్ ఎవరిదన్న విషయంపై తీర్పు ఇచ్చేసింది కాబట్టి, గతాన్ని ఇక మర్చిపోయి అఖిలేష్‌ను ఆశీర్వదించమన్నారు లాలు. 
 
సోమవారం సమాజ్ వాదీ పార్టీ ఇంటితగవును ఎన్నికల సంఘం తీర్పు తేల్చేసిన వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ మీడియా ద్వారా అఖిలేష్‌కు అభినందనలు అందచేశారు మరోవైపున ములాయంకి హితవచనాలు పలికారు. అఖిలేష్‌కు అభినందనలు. ఈ సమయంలో ములాయంని అభ్యర్థిస్తున్నాను. యూపీలో జరుగుతున్నది ఒక రాష్ట్ర ఎన్నిక కాదు. ఒక దేశం ఎన్నిక. సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ తగాదాను ప్రోత్సాహకంగా తీసుకుని అనేక మంది వేచి ఉంటున్నారు. ఇక ఒక్క నిమిషం సమయం కూడా వేచి ఉండవద్దు. అఖిలేష్‌కి మీ ఆశీర్వదాలు అందించండి. పార్టీలో ఏ చీలికా లేదని చెబుతూ ఎన్నికల ప్రచారానికి శరవేగంగా సన్నాహాలు చేయండి అంటూ లాలూ తన బంధువు కూడా అయిన ములాయంకి సూచించారు.
 
ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఓడిపోయినట్లయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఇక దేశం ఎన్నటికీ బతికిబట్టకట్టలేదని హెచ్చరించిన లాలూప్రసాద్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ సంస్థాపకుడు ములాయంని తక్షణమే పాత తగాదాలకు స్వస్తి పలికి చేయాల్సిన కర్తవ్యం గురించి ఆలోచించమన్నారు..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాడు ఔరంగజేబు.. నేను షాజహాన్.. అతనిపై దండయాత్ర (పోటీ) చేస్తా : ములాయం