Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం (video)

Advertiesment
Army

సెల్వి

, శనివారం, 2 ఆగస్టు 2025 (09:03 IST)
Army
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సైనిక దళాలకు, ఉగ్రమూకలకు మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని హతమార్చామని శనివారం ఉదయం ఆర్మీ అధికారులు ధృవీకరించారు. చనిపోయిన ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందినవాడని అనుమానిస్తున్నారు. 
 
దక్షిణ కాశ్మీర్‌లోని అకల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టుల కదలికల సమాచారంతో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 
 
ఈ ప్రాంతంలో ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉంటారని ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి, మొత్తం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. రాత్రిపూట ఆపరేషన్ చేయడం సవాలుగా ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు తప్పించుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు