Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మిస్ వరల్డ్ 2024' విజేతగా చెక్ రిపబ్లిక్ భామ పిస్కోవా

Krystyna Pyszkova

ఠాగూర్

, సోమవారం, 11 మార్చి 2024 (11:55 IST)
ముంబై వేదికగా జరిగిన 'మిస్ వరల్డ్ 2024' పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 112 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. వీరిలో క్రిస్టీనా ప్రథమ స్థానంలో నిలించారు. క్రిస్టీనా తర్వాత తొలి మూడు స్థానాల్లో లెబనాన్ దేశానికి చెందిన యాస్మిన్ అజైటౌన్, ట్రినాడడ్ అండ్ టుబాగో దేశానికి చెందిన ఆచే అబ్రహాంస్, బొత్స్వానా దేశానికి చెందిన లిసాగో చోంబో నిలిచారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో రన్నరప్‌గా లెబనాన్ భామ అజైటౌన్ నిలిచారు. 
 
అయితే, స్వదేశంలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌కు పూర్తి నిరాశే మిగిలింది. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీ శెట్టి టాప్-8కే పరిమితమయ్యారు. చివరి వరకు ఆమె గట్టీ పోటీనే ఇచ్చినా అజైటౌన్‌కు లెబనాన్ టాప్-4లో చోటు దక్కించుకోవడంతో సినీశెట్టి నిరాశతో వెనుదిరగాల్సివచ్చింది. ఈ కార్యక్రమానికి అతిథిగా ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ ఉమెన్ జూలియా మోర్లీ మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు. 
 
రాజ్యసభకు సుధామూర్తి నామినేట్... రాష్ట్రపతి సిఫారసు 
 
ప్రముఖ విద్యావేత్త సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలయ్యారు. ఆమెను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుక్రవారం వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే గౌరవార్థం సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషిఅపారం. స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్ కావడం నారీశక్తికి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి" అని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
కాగా, 73 యేళ్ల సుధామూర్తి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి. మూర్తి ట్రస్ట్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా వితరణశీలిగా దేశవ్యాప్తంగా ఆమె సుపరిచితమే. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో వృత్తి జీవితానని ప్రారంభించిన ఆమె.. పలు అనాథశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల కమిషనర్ల నియామకం.. కేంద్రం చర్యలు