దేశంలో ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్‌లు శరవేగంగా వ్యాప్తిస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన ఆంక్షలను విధించి అమలు చేస్తున్నాయి. అయితే, కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు సోకినట్టు నిర్ధారించేందుకు పరీక్షలు చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత ఈ పరీక్షా ఫలితాలు రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఇందులో కరోనా పరీక్ష అయితే తక్షణం వస్తుంది. కానీ ఒమిక్రాన్ ఫలితం వచ్చేందుకు 48 గంటల పాటు వేచిచూడాల్సివుంది.
ఈ నేపథ్యంలో కేవలం 45 నిమిషాల్లోనే ఒమిక్రాన్ ఫలితం తెలుసుకునేలా ఓ పరీక్షా కిట్ అందుబాటులోకి వచ్చింది. చెన్నైకు చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ కిట్ పేరు క్రివిడా నోవస్ కోవిడ్ 19 టెస్టింగ్ కిట్.
ఇమ్యూజెనిక్స్ బయోసైన్స్ అనే సంస్థతో కలిసి ఈ కిట్‌ను క్రియా సంస్థ తయారు చేసింది. దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని క్రియా సంస్థ పేర్కొంది. తమకు ఏ వేరియంట్ బారిపడ్డామో ఇది ఖచ్చితంగా చెప్పేస్తుందని తెలిపింది.
మరోవైపు, ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్ధారించింది. ప్రస్తుతం ఈ సంస్థ వారానికి 50 లక్షల కిట్లను తయారు చేస్తుంది.