Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంజీఆర్ బాడీగార్డు కన్నుమూత.. చెన్నైకి శశికళ ఎంట్రీ.. వేడెక్కనున్న రాజకీయాలు

ఎంజీఆర్ బాడీగార్డు కన్నుమూత.. చెన్నైకి శశికళ ఎంట్రీ.. వేడెక్కనున్న రాజకీయాలు
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (12:52 IST)
MGR
తమిళనాడు మాజీ సీఎం, పురట్చితలైవర్‌ ఎం.జి.రామచంద్రన్‌కు బాడీగార్డుగా వ్యక్తిగత సహాయకుడుగా ఉన్న కేపీ రామకృష్ణన్‌ కన్నుమూశారు. ఇటీవల తన ఇంటి మెట్లపై నుంచి జారిపడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. 
 
అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. కాగా, పాల వ్యాపారి నుంచి అంచలంచెలుగా ఎదిగిన రామకృష్ణన్‌ .. ఎంజీఆర్‌కు బాడీగార్డుగా నియమితులయ్యారు. 
 
అలా, మూడు దశాబ్దాల పాటు లెజండ్రీ యాక్టర్‌ సేవకు అంకితమయ్యారు. అదేసమయంలో ఆయన పలు సినిమాల్లో కూడా నటించారు. అంతేకాకుండా, 'ఎంజీఆర్‌ ఒరు సగాబ్దమ్‌' అనే పుస్తకాన్ని రాసినందుకు రామకృష్ణన్‌ అరుదైన సత్కారం కూడా పొందారు. ఈయనకు ఒక కుమారుడున్నాడు. ఈయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
మరోవైపు అక్రమార్జన కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదలైన శశికళకు స్వాగతం పలుకుతూ తొలిసారిగా చెన్నైలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటి వరకూ తేని, తిరుచ్చి జిల్లాల్లో మాత్రమే శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే స్థానిక నాయకులు పోస్టర్లు అతికించి సంచలనం కలిగించారు. ఆ పోస్టర్లు అతికించిన ముగ్గురు పార్టీ నేతలను అన్నాడీఎంకే పార్టీ నుంచి తొలగించింది. 
 
ఈ నేపథ్యంలో మంత్రి జయకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయపురంలోని షేక్‌మేస్త్రీ వీథి, సూర్యనారాయణన్‌ వీథి సహా పలు వీథులలో అన్నాడీఎంకే స్థానిక నాయకుడు ఏసీ శేఖర్‌ పేరుతో పోస్టర్లు అతికించారు. అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళకు ఘనస్వాగతమంటూ ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పా మాటున గుట్టుగా వ్యభిచారం.. ఎక్కడ?