కోల్‌కతా సాల్ట్ లేక్ గ్యాంగ్ రేప్ : ముగ్గురు క్యాబ్ డ్రైవర్ల అరెస్టు.. మరొకరి కోసం గాలింపు
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 24 యేళ్ళ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 24 యేళ్ళ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.
సాల్ట్‌లేక్ సెక్టార్-5లో ఆదివారం రాత్రి 24 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ మహిళను సెక్టార్-1 ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడేసి పారిపోయారు. ఆ బాధితురాలిని సోమవారం తెల్లవారుజామున పోలీసులు గుర్తించి రక్షించారు.
స్థానిక బార్‌లో పనిచేస్తున్న బాధితురాలు.. సెక్టార్ 5లోని తన స్నేహితుల వద్దకు వెళ్లేందుకు వాహనం కోసం వేచిచూస్తుండగా.. కారులోకి ఎక్కించుకున్న నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దీనిపై కేసు నమోదు చేసి కామాంధుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన కోల్‌కతా పోలీసులు.. ముగ్గురు క్యాబ్‌డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.