Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైనికులేం పాపం చేశారు, రాజకీయనేతలను ఏసేయండి.. మావోయిస్టులకు పప్పూ సలహా

నిన్నమొన్నటివరకు భయంకరమైన ఆరోపణలపై జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన పెద్దమనిషి తను. కానీ పాపులారిటీకి ఏదో ఒక మార్గం అవలంబించాలి కాబట్టి ఈసారి మావోయిస్టులకే సలహా ఇస్తూ మీడియా ముందుకొచ్చారు. అది కూడా మామూ

సైనికులేం పాపం చేశారు, రాజకీయనేతలను ఏసేయండి.. మావోయిస్టులకు పప్పూ సలహా
హైదరాబాద్ , గురువారం, 4 మే 2017 (09:26 IST)
నిన్నమొన్నటివరకు భయంకరమైన ఆరోపణలపై జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన పెద్దమనిషి తను. కానీ పాపులారిటీకి ఏదో ఒక మార్గం అవలంబించాలి కాబట్టి ఈసారి మావోయిస్టులకే సలహా ఇస్తూ మీడియా ముందుకొచ్చారు. అది కూడా మామూలు సలహా కాదు. దేశాన్ని కాపాడుతున్న సైనికులను ఏమీ చేయవద్దు అన్నలూ.. కావాలంటే రాజకీయ నాయకులును చంపేయండి  అంటూ డేరింగ్ ప్రకటన ఇచ్చేశారు. రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది కాబట్టి వారిని చంపమని కోరినా జనం పెద్దగా పట్టించుకోరు కాబట్టి సదరు ఎంపీ కమ్ నేరస్తుడు భద్రతా బలగాల పక్షాన నిలుస్తున్నట్లు ఫోజు కొట్టి సంచలనం సృష్టించారు.
 
నిన్న మొన్నటివరకు జైల్లో ఉండి, ఈ మధ్యే బయటకు వచ్చిన జన అధికార్ పార్టీ ఎంపీ రాజేశ్‌ రంజన్‌ అలియాస్ పప్పూ యాదవ్ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. మావోయిస్టులు కావాలంటే రాజకీయ నాయకులను చంపేయొచ్చు గానీ, భద్రతా దళాల సిబ్బందిని ఏమీ చేయొద్దని కోరారు. నాయకులు దేశాన్ని దోచేసుకుంటున్నారని, భద్రతా దళాలు దేశానికి రక్షణ కల్పిస్తున్నాయని చెప్పారు. అందువల్ల మావోయిస్టులు ముందుగా నాయకులను చంపేయాలని కోరారు. 
 
ఇంతకుముందు కూడా పప్పూ యాదవ్ తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టిచంపితే వారికి రూ. 10 లక్షలు నజరానాగా ఇస్తానని గతంలో ప్రకటించారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదించినా వారికి రూ. 25వేలు నజరానాగా ఇస్తానని చెప్పారు. అవినీతిపరుల్ని ప్రభుత్వం అణచివేయకపోతే దళితులు, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి తుపాకులు ఇవ్వాల్సి వస్తుందని గతంలో హెచ్చరించారు.
 
పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో తీవ్రవాదం కూడా తగ్గిపోతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని, కానీ నోట్ల రద్దు జరిగి ఇన్నాళ్లయిన తర్వాత కూడా ఎందుకు మావోయిస్టుల దాడులు కొనసాగుతున్నాయని పప్పు యాదవ్ ప్రశ్నించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టం లేని వివాహం... భర్తకు విషపు ఇంజెక్షన్ ఇచ్చిన భార్య... ఎక్కడ?