Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖుష్భూ వచ్చెయ్.. నేను రెడీ... రజినీకాంత్

ఖుష్భూ.. తమిళ సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఖుష్భూను మించిన హీరోయిన్ లేదంటూ ఏకంగా అభిమానులు ఆలయాన్నే కట్టేశారు. అంతటితో ఆగలేదు.. కొంతమంది ఖుష్భూ ఫోటోను ఇంటిలోనే పెట్టుకున్నారు. అయితే ఖుష్భూ ఆ తరువాత బొద్దుగా మారడంతో పాటు సీరియళ్ళకు మాత్రమ

Advertiesment
Khushboo
, శనివారం, 10 జూన్ 2017 (14:31 IST)
ఖుష్భూ.. తమిళ సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఖుష్భూను మించిన హీరోయిన్ లేదంటూ ఏకంగా అభిమానులు ఆలయాన్నే కట్టేశారు. అంతటితో ఆగలేదు.. కొంతమంది ఖుష్భూ ఫోటోను ఇంటిలోనే పెట్టుకున్నారు. అయితే ఖుష్భూ ఆ తరువాత బొద్దుగా మారడంతో పాటు సీరియళ్ళకు మాత్రమే పరిమితమైపోయింది. సింపుల్‌గా సినిమాల్లో నటించడం ఖుష్భూకు అలవాటు. ఆ నటనే అందరినీ ఆకట్టుకుంది. 
 
అయితే ఖుష్భూ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఖుష్భూకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. అయితే ఆ తరువాత అటు సినీ రంగంలోను ఇటు రాజకీయంలోను పెద్దగా కనిపించకుండా సైలెంట్‌గా ఉంటున్నారు. రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. సొంతంగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలోకి రజినీ కూడా వెళ్ళిపోయారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో రజినీ చెంత చేరేందుకు ఖుష్భూ సిద్ధమైపోయారు. కాలా సినిమా షూటింగ్‌లో ఉన్న రజినీని స్వయంగా కలిశారట ఖుష్భూ. ముంబైకు నేరుగా వెళ్ళిన ఖుష్భూ మీరు పెట్టే రాజకీయ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారట. ఇప్పటికే ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకే రజినీ ఖుష్భూ చెప్పిన వెంటనే సరేనని తలూపాడట. 10 నిమిషాలకు పైగా రాజకీయాల గురించి ఇద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. 
 
మొదట్లో కేవలం సినిమా గురించి వీరు మాట్లాడుకున్నరని అందరూ భావించారు. అయితే ఆ తరువాత అసలు విషయం బయటకు వచ్చింది. ఖుష్భూ రజినీ పార్టీలో చేరితే పార్టీకి మంచి మైలేజ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇక మిగిలింది.. రజినీ రాజకీయ రంగప్రవేశమే. దానికి కూడా జూలై 3న ముహూర్తం ఖరారు చేసుకోవడంతో ఇక తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ ఉద్యోగస్తులను బట్టలిప్పి కొడతా : చెవిరెడ్డి... ఆయన బాటలో రోజా, పెద్దిరెడ్డి