కేరళలో దారుణం చోటుచేసుకుంది. అలప్పుజ సమీపంలోని కాయంకుళంలో వరి పొలంలో చేపలు పడుతుండగా గొంతులో చేప ఇరుక్కుపోయి ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడిని పుతుప్పల్లికి చెందిన ఆదర్శ్ అలియాస్ ఉన్ని (25)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి వరి పొలాన్ని ఎండబెడుతూ చేపలు పడుతుండగా ఈ సంఘటన జరిగింది. అతను తన నోటిలో ఉన్న చేపను కొరికి మరొక చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అది అతని గొంతులోకి దిగింది. ఆ యువకుడిని వెంటనే ఓచిరాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయారు.
ఆదర్శ్ మృతదేహాన్ని కాయంకుళం తాలూకా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.