Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమ్మించాడు.. పురుగుల మందు తాపించి ఆపై రేప్ చేసి నగలు దోచుకున్న కామాంధుడు!

సహోద్యోగే కదా అని అతని మాటలు నమ్మింది. కష్టాల్లో ఉన్నాను ఆదుకోవాలని కోరడంతో మెడలోని చైన్ తాకట్టుపెట్టి డబ్బు సాయం చేసింది. ఆ తాకట్టుపెట్టిన చైన్ తెచ్చివ్వమని అడిగిన పాపానికి ఏకంగా పురుగుల మందు తాపించి

నమ్మించాడు.. పురుగుల మందు తాపించి ఆపై రేప్ చేసి నగలు దోచుకున్న కామాంధుడు!
, శనివారం, 6 ఆగస్టు 2016 (12:58 IST)
సహోద్యోగే కదా అని అతని మాటలు నమ్మింది. కష్టాల్లో ఉన్నాను ఆదుకోవాలని కోరడంతో మెడలోని చైన్ తాకట్టుపెట్టి డబ్బు సాయం చేసింది. ఆ తాకట్టుపెట్టిన చైన్ తెచ్చివ్వమని అడిగిన పాపానికి ఏకంగా పురుగుల మందు తాపించి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి.. ఆమె ధరించిన నగలను దోచుకుని పారిపోయిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర సంఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో జరిగింది. ఈ దారుణ హత్యకు గురైన మహిళ కేరళ రాష్ట్ర వాసి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆమెకు వయస్సు 42 యేళ్లు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వగ్రామం కోయంబత్తూరు అయినప్పటికీ.. త్రిశూర్‌కు వెళ్లి స్థిరపడ్డారు. కుటుంబ జీవనోపాధి కోసం ఆమె త్రిసూర్‌లోని గార్మెంట్ షాప్‌లో ఉద్యోగానికి చేరింది. అదే షాప్‌లో పనిచేసే సిజో అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అప్పటి నుంచి వారిద్దరు సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. 
 
దీంతో తనకు ఆర్థిక సమస్యలున్నాయని, ఇబ్బందుల్లో ఉన్నానని సిజో ఆమెను నమ్మించాడు. ప్రియుడిని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన మెడలోని చైన్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తీసిచ్చింది. కొద్దిరోజుల తర్వాత చైన్ తీసివ్వమని కోరగా, ఇద్దరం వెళ్లి తీసుకుందాం రమ్మని నమ్మబలికాడు. వారిద్దరు కలిసి బైక్‌పై బయలుదేరారు. 
 
బైక్‌‌పై పొల్లాచ్చి వెళుతూ మార్గమధ్యంలో సిజో బైక్ ఆపాడు. ఎందుకు ఆపావని అడగ్గా డ్రింక్ తాగి వెళదామని నమ్మించాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ముందే పక్కా ప్లాన్‌తో ఉన్న సిజో ఆమెకు తాగమని ఇచ్చాడు. ఈ విషయం తెలియని ఆమె డ్రింక్ తాగింది. కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను రేప్ చేసి, ఒంటిమీద ఉన్న నగలు తీసుకెళ్లాడు. 
 
పొలాచ్చి సమీపంలోని పూసరిపట్టి గ్రామంలోని పొలాల్లో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న కొందరు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిజో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడిగిన డబ్బులు ఇవ్వలేదనీ ప్రయాణికుడిపై దాడి చేసిన హిజ్రాలు!