Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1984నాటి లవర్స్ ఒక్కటయ్యారు.. కూతుళ్లే వారికి పెళ్లి చేశారు.. సోషల్ మీడియాలో వైరల్!

1984నాటి లవర్స్ ఒక్కటయ్యారు. జీవితంలో కొన్ని కారణాలచే విడిపోయారు. వీరి ప్రేమకథను తెలుసుకున్న ఆమె కుమార్తెలు ఇద్దరికీ వివాహం చేసిపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లవ్ స్ట

Advertiesment
Kerala woman
, గురువారం, 28 జులై 2016 (13:13 IST)
1984నాటి లవర్స్ ఒక్కటయ్యారు. జీవితంలో కొన్ని కారణాలచే విడిపోయారు. వీరి ప్రేమకథను తెలుసుకున్న ఆమె కుమార్తెలు ఇద్దరికీ వివాహం చేసిపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లవ్ స్టోరీకి మంచి కామెంట్స్, లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 1984వ సంవత్సరంలో కొల్లంకు సమీపంలోని ఓచిర అనే గ్రామంలో అనిత అనే యువతి పదో తరగతి చదువుతుంది. 
 
ఆమె తండ్రి ఆర్మీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అలాగే విక్రమన్ అనే వ్యక్తి సీపీఎంలోనూ సభ్యుడిగా ఉంటూ.. టీచర్‌గా ఒక చిన్నపాటి ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అకేషన్స్‌లో విక్రమన్ అనితకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇలా అన్నీ లవ్ స్టోరీల తరహాలోనే... అమ్మాయి లవ్ స్టోరీకి ఆమె తండ్రి అడ్డం పడ్డారు. దీంతో చేసేది లేక.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 
 
అయితే అనితకు పెళ్లికి తర్వాత కష్టాలు మొదలయ్యాయి. అనితను హింసించే వాడు. అయినా అనిత ఆతని ఆగడాలను భరించింది. ఇంకా ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యింది. కొన్నాళ్లకు అనిత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. అనితకి పెళ్లి జరిగిందన్న విషయాన్ని విక్రమన్ భరించలేకపోయాడు. ఎంతగానో కుమిలిపోయాడు. అసలు జీవితంలో పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకుని, కేవలం ఒక రాజకీయ కార్యకర్తగా ఉంటూ అనితపై ప్రేమని చంపుకోలేక 30 ఏళ్ళు గడిపేశాడు. ఈ విషయం అనిత కుమార్తెలైన అశిలి, అథిరలకు తెలిసింది.
 
తన తల్లిని విక్రమన్‌ను భార్యాభర్తలుగా చేయాలని ఆ కూతుర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని తన తల్లితో, అలానే విక్రమన్‌తో చర్చిస్తే.. ముందు కూతుళ్ళ పెళ్లి జరిపించాక.. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇద్దరూ అంగీకరించారు. దీంతో ఇద్దరు కూతుళ్ల పెళ్ళయ్యాక.. అనిత, విక్రమన్‌ల వివాహం అట్టహాసంగా జరిగింది. ముప్పై రెండేళ్ల ఈ ప్రేమకథకు జూలై 21, 2016న వెడ్డింగ్ కార్డు పడింది. అనిత చిన్న కూతురు అథిర ఈ విషయాన్ని తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాంధీజీ హత్య కోసం పిస్టల్‌ను ఇటలీ నుంచి తెచ్చారా? 15 తర్వాత బహిర్గతం చేస్తా : సుబ్రమణ్య స్వామి ట్వీట్