Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్‌ను నగ్నంగా చేసి వేధించిన సీనియర్లు.. చెడిపోయిన కిడ్నీలు

కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ఓ జూనియర్‌ విద్యార్థిని నగ్నంగా చేసి ఐదు గంటల పాటు సీనియర్లు అలాగే ఉంచారు. దీంతో అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతు

Advertiesment
జూనియర్‌ను నగ్నంగా చేసి వేధించిన సీనియర్లు.. చెడిపోయిన కిడ్నీలు
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (17:24 IST)
కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ఓ జూనియర్‌ విద్యార్థిని నగ్నంగా చేసి ఐదు గంటల పాటు సీనియర్లు అలాగే ఉంచారు. దీంతో అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కేరళలోని త్రిశూర్‌లో కొట్టాయంకు చెందిన 22 ఏళ్ళ దళిత యువకుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు 22 ఏళ్ళ విద్యార్థిని తీవ్రంగా వేధించారు. సుమారు 5 గంటలపాటు 8 మంది సీనియర్ విద్యార్థులు జూనియర్‌ దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టి చిత్రహింసలకు గురి చేశారు. తీవ్రమైన వ్యాయామాలు చేయించారు. 
 
సీనియర్ల అకృత్యం వల్ల ఈ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పనితో ఆ విద్యార్థి రెండు కిడ్నీలు పాడయ్యాయి. బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్యూయల్‌ సిమ్‌లో ఆపిల్‌ ఐఫోన్... పేటెంట్ హక్కులు సొంతం?