Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదేళ్ల బాలుడిపై అసహజ శృంగారం.. కింగ్స్ డేవిడ్ స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్..

అసహజ శృంగార కేసులో ఓ స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్టయిన ఘటన కొచ్చిలో చోటుచేసుకుంది. బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో కింగ్స్ డేవిడ్ స్కూల్ ప్రిన్సిపాల్, మతగురువు బాసిల్ కురియాకోస్ (65)ను కేరళ పోలీసులు ఆదివా

Advertiesment
Kerala priest arrested for unnatural sex with 10-year old boy in Kochi
, సోమవారం, 2 జనవరి 2017 (10:20 IST)
అసహజ శృంగార కేసులో ఓ స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్టయిన ఘటన కొచ్చిలో చోటుచేసుకుంది. బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో కింగ్స్ డేవిడ్ స్కూల్ ప్రిన్సిపాల్, మతగురువు బాసిల్ కురియాకోస్ (65)ను కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ 377 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల బాలుడితో ఆయన అసహజరీతిలో శృంగారం జరిపినట్టు బాసిల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు.
 
కున్నాతునాడ్‌ సమీపంలో ఉన్న కింగ్స్‌ డేవిడ్‌ స్కూల్‌‌కు బాసిల్‌ ప్రిన్సిపాల్‌‌గా వ్యవహరిస్తున్నారు. హాస్టల్‌‌లో ఉంటున్న బాధిత బాలుడిపై ఆయన డిసెంబర్‌ 21 రాత్రి లైంగిక వేధింపులు పాల్పడినట్టు వెల్లడైంది. హర్యానాలో పనిచేస్తున్న బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆయనకు 14 రోజుల పోలీసు కస్టడీ విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీ న్యూస్.. 105వ ఏట అడుగుపెట్టిన బామ్మ.. శాకాహారమే దీర్ఘాయుష్షుకు కారణం.. ఎవరైనా ఇంటికొస్తే?