నదిలో స్నానం చేసేందుకు వెళ్లి మలయాళ నటుడు అనిల్ దుర్మరణం పాలయ్యారు. మలయాళ నటుడు అనిల్ నేదుమంగాడ్ శుక్రవారం తోడుపుళ మలంకర ఆనకట్టలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయారు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అనిల్ ఆయన వయస్సు 48 సంవత్సరాలు.
ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించి తోడుపుజ్జాలో బస చేసాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షూటింగ్ విరామ సమయంలో నటుడు, అతని స్నేహితులు ఆనకట్టలో స్నానం చేయడానికి వెళ్లారు. అలా స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీటి లోతుగాలోకి ప్రవేశించినప్పుడు అతడు మునిగిపోయాడు. వెంటనే అక్కడున్న ఈతగాళ్లు ఆయనను బయటకు తీసారు. సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
నటుడి మృతదేహాన్ని తోడుపుజ్జా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ తన వృత్తి జీవితాన్ని టీవీ యాంకర్‌గా ప్రారంభించాడు. తరువాత, "కమ్మట్టి పదమ్", "ఎంజన్ స్టీవ్ లోపెజ్" మరియు "పోరింజు మరియం జోస్" చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆయన ఇటీవల ప్రజాదరణ పొందిన హిట్ మూవీ "అయ్యప్పనమ్ కోషియం"లో పోలీసు అధికారిగా కనిపించారు. అయితే, నటుడి మరణంలో ఎటువంటి ఫౌల్ ప్లే లేదని నిర్ధారించడానికి పోలీసులు ఈ కేసుపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.