Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళకు కొత్త కష్టం.. రాట్ ఫీవర్ భయం భయం.. 19మంది మృతి

కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రకృతి విలయంలో అతలాకుతలమైన కేరళకు దేశ వ్యాప్తంగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1,027 కోట్లు వచ్చినట్టు అధికారికంగా ప

Advertiesment
కేరళకు కొత్త కష్టం.. రాట్ ఫీవర్ భయం భయం.. 19మంది మృతి
, మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:13 IST)
కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రకృతి విలయంలో అతలాకుతలమైన కేరళకు దేశ వ్యాప్తంగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1,027 కోట్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. వరదల బారినపడిన కేరళకు 4.76 లక్షల మంది ఆన్‌లైన్‌లో విరాళాలిచ్చారు.


మొత్తం విరాళాల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా రూ.145.17 కోట్లు రాగా, రూ.46.04 కోట్లు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా వచ్చాయి. డైరెక్ట్ డిపాజిట్లు, చెక్కుల రూపేణా రూ.835.86 కోట్లు వచ్చాయి.
 
వందేళ్ల కేరళ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని ఈ విపత్తులో సుమారు 483 మంది ప్రాణాలు కోల్పోగా, వేల కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. 14.50 లక్షల మంది 3,000కు పైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారీ వరదల్లో చిక్కుకున్న కేరళకు కొత్త చిక్కొచ్చి పడింది. రాట్ ఫీవర్ కేరళ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. 
 
ఇప్పటికే దాదాపు 200 మందికి రాట్ ఫీవర్ వ్యాధి సోకగా, ఇంతవరకూ 19మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. నీటిలో జంతువుల మూత్రం కలిసినందున బ్యాక్టీరియా ప్రబలుతుందని, ఆ నీటిలో పని చేస్తున్న వారికి ఈ వ్యాధి సోకుతుందని అధికారులు చెప్తున్నారు. వరద సహాయక చర్యల్లో పనిచేస్తున్న వారికి రాట్ ఫీవర్‌ను నివారించే డాక్సీ సెలైన్ టాబ్లెట్లను ఇస్తున్నామని తెలిపారు. 
 
కాగా, అధిక జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులు తదితరాలు ఈ వ్యాధి లక్షణాలని, ప్రజలు బాగా మరిగించిన నీటినే తాగాలని శుభ్రత పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం సైతం రాట్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతుండటాన్ని గుర్తించి, ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది. దోమల నుంచి తమను తాము కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు సూచనలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవిశాస్త్రితో ప్రేమాయణమా..? ఐ లవ్ ఐస్ క్రీమ్.. నిమ్రత్ కౌర్ ట్వీట్స్