Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపయోగం లేదని నేనే కోసుకున్నా... ఇందులో తప్పేముంది..: దొంగబాబా కొత్త పల్లవి

తన అత్యాచారయత్నం పథకం బెడిసికొట్టడంతో ఆస్పత్రి పాలైన నిందితుడు గంగేశానంద తీర్థపాద కొత్త పల్లవి అందుకున్నాడు. తన జననాంగాన్ని తానే కోసేసుకున్నానని చెప్పాడు. ఎందుకు? అనడిగితే.. రహస్యాంగంతో ఎలాంటి ఉపయోగం

ఉపయోగం లేదని నేనే కోసుకున్నా... ఇందులో తప్పేముంది..: దొంగబాబా కొత్త పల్లవి
, ఆదివారం, 21 మే 2017 (10:55 IST)
తన అత్యాచారయత్నం పథకం బెడిసికొట్టడంతో ఆస్పత్రి పాలైన నిందితుడు గంగేశానంద తీర్థపాద కొత్త పల్లవి అందుకున్నాడు. తన జననాంగాన్ని తానే కోసేసుకున్నానని చెప్పాడు. ఎందుకు? అనడిగితే.. రహస్యాంగంతో ఎలాంటి ఉపయోగం లేకపోవడంతోనే ఈ చర్యకు పాల్పడ్డానని చెప్పాడు. ఈ మేరకు అతడి నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
 
గంగేశానంద అనే వ్యక్తి (54)ది ఎర్నాకులం జిల్లా కొల్లెంచెరి గ్రామం. 15 యేళ్ల క్రితం ఊర్లో తాను నిర్వహిస్తున్న టీస్టాల్‌ను మూసేసి కొల్లాంలోని పద్మనా చట్టంబి స్వామి ఆశ్రమంలో సన్యాసిగా చేరాడు. గంగేశానంద తీర్థపాదగా ప్రాచూర్యం పొందాడు. కొన్నాళ్లకు యువతి కుటుంబంతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో వారి ఇంటికి తరచూ వస్తూపోతూ ఉండేవాడు. యువతి తండ్రికి పక్షవాతం రావడంతో ఉపశమనానికి కొన్నాళ్లుగా ఇంట్లో అతడితో పూజలు చేయిస్తున్నారు.
 
అయితే.. యువతిపై కన్నేసిన గంగేశానంద.. ఆమెపై చాలారోజుల నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆ యువతి పదునైన కత్తితో అతడి రహస్యాంగాన్ని కోసివేసింది. బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
గంగేశానంద తమ కుటుంబానికి చాలా ఏళ్లనుంచి తెలుసునని, మైనర్‌గా ఉన్నప్పటి నుంచే తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని, వద్దని ప్రతిఘటించినా వినకపోవడంతో తాను ఆపని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. 
 
కాగా నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతిపై ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మరోవైపు యువతి చర్యపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు మంచి పనే చేసిందని, అత్యంత ధైర్యసాహసాలతో వ్యవహరించిందని సీఎం పినరయి విజయన్‌ కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షరీఫ్‌కు చెప్పులదండ వేసి సరిహద్దుల వెంబడి పరుగెత్తిస్తే రూ.20 లక్షల బహుమతి