Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్ను రేప్ చేసిన వాళ్లలో ఎవడితో నీకు బాగా తృప్తి కలిగింది... అత్యాచార బాధితురాలికి ప్రశ్న

సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. కామాంధుల కామ దాహానికి బలైపోయిన ఓ బాధితురాలిని పోలీసులు అసభ్యమైన ప్రశ్నలతో వేధించారు. వివరాల్లోకి వెళితే... కేరళ లోని త్రిషూర్‌లో కట్టుకున్న భర్త ప్రమాదం బారిన పడ్డారని అబద్ధం చెప్పి ఓ మహిళను గుర్తు తెలియని

Advertiesment
Kerala Gang Rape case
, గురువారం, 3 నవంబరు 2016 (15:50 IST)
సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. కామాంధుల కామ దాహానికి బలైపోయిన ఓ బాధితురాలిని పోలీసులు అసభ్యమైన ప్రశ్నలతో వేధించారు. వివరాల్లోకి వెళితే... కేరళ లోని త్రిషూర్‌లో కట్టుకున్న భర్త ప్రమాదం బారిన పడ్డారని అబద్ధం చెప్పి ఓ మహిళను గుర్తు తెలియని చోటుకు తరలించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు కూడా ఆమెను మానసికంగా హింసించారు.
 
ఈ ఘటన గురించి మలయాళీ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి తన ఫేస్ బుక్ లో వివరించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన బాధిత మహిళ తన 30వ సంవత్సరంలో జరిగిన ఘటన గురించి ఇలా చెప్పుకున్నారు. తన భర్తకు ప్రమాదం జరిగిందని అబద్దం చెప్పి తనను నమ్మించి గుర్తు తెలియని చోటుకు తీసుకువెళ్లి అక్కడ తనపై నలుగురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళితే వారిలో ఒక పోలీసు... నీపై అత్యాచారం చేసిన వాళ్లలో ఎవడితో నీకు బాగా తృప్తి కలిగింది అంటూ దారుణమైన ప్రశ్నను అడిగి ఆమెను మానసికంగా హింసించాడు. 
 
తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునేందుకు ఎప్పుడు వెళ్లినా పోలీసులు ఇదే తరహా ప్రశ్నలు వేస్తూ కేసు వాపసు తీసుకోవాలన్నట్లు మాట్లాడారు.  నిజం చెబితే తన పిల్లల్ని చంపేస్తామని బెదిరించారనీ, దానితో జడ్జి.. నీపై ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు నేను ఏడ్చానంటూ ఆమె చెప్పుకున్నారు. కాగా నిందితుల్లో సీపీఎంకు చెందిన వ్యక్తి ఉన్నట్లు తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా ప్రధాన రహదారిలో బొమ్మ కారుతో చిన్నారి ప్రయాణం.. షాకింగ్ వీడియో మీకోసం..