Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kerala: మైనర్ బాలుడిపై 14మంది వ్యక్తులు రెండేళ్ల పాటు అత్యాచారం.. ఆ యాప్‌ వల్లే అంతా!

Advertiesment
rape victim

సెల్వి

, గురువారం, 18 సెప్టెంబరు 2025 (14:31 IST)
కేరళలో ఒక మైనర్ బాలుడిపై అత్యాచారం జరిగింది. 16 ఏళ్ల బాలుడిని దాదాపు 14మంది వ్యక్తులు రెండేళ్ల పైగా లైంగికంగా వేధించారు. చివరకు ఆ మైనర్ బాలుడి తల్లి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో ఓ డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. 
 
ఆ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత అతడికి 14 మంది వ్యక్తులు పరిచయం అయ్యారు. వీరు కాసర్‌గోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకుళం జిల్లాల్లోని వివిధ ప్రదేశాలలో ఆ మైనర్‌ను పిలిచి అతడిపై అత్యాచారం చేశారు. అయితే ఇక్కడ ఆ 14 మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. 
 
ఇలా రెండు ఏళ్లుగా ఆ మైనర్‌పై లైంగిక దాడి జరుగుతూనే ఉంది. అయితే బాధితుడి తల్లికి తన కొడుకు ప్రవర్తనలో తేడాను గమనించింది. తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యింది.  దీంతో తల్లి తన కొడుకును కఠినంగా ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. జరిగిన విషయాన్ని మొత్తం అతడు తన తల్లికి వివరించాడు. 
 
వెంటనే ఆమె చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించగా.. వారు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత బాలుడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. దీని ఆధారంగా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012 కింద 14 ప్రత్యేక కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే దాదాపు 9 మంది నిందితులను అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Telangana: సెప్టెంబర్ 21- 13 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు