కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఎల్.డి.ఎఫ్ విజయభేరీ మోగించింది. ఉదయం 11 గంటలకు వెల్లడైన ఫలితాల ట్రెండ్ మేరకు 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో ఎల్.డి.ఎఫ్ పార్టీ 90 సీట్లల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే, యూడీఎఫ్ 48 సీట్లలో ఆధిక్యతలో ఉంది. బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యతతో ఉంది.
పుత్తుపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఊమన్ చాందీ ముందంజలో ఉన్నారు. హరిపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ చెన్నితల, మలంపుళా నియోజకవర్గంలో అచ్యుతానందన్ ముందంజలో ఉన్నారు. మొత్తం 140 స్థానాలకు గాను 71 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. ఎల్డీఎఫ్ ఆధిక్యం దిశగానే కొనసాగుతోంది.