Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. 12 ఏళ్ల బాలుడి మృతి

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. 12 ఏళ్ల బాలుడి మృతి
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (09:44 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలోనూ కోవిడ్‌తో జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఓ వైపు కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళను.. ఇప్పుడు నిఫా వైరస్‌ కలవరపెడుతోంది. కోజికోడ్ జిల్లాలోని మవూర్‌కు చెందిన 12ఏళ్ల బాలుడు వైరస్‌ బారిన పడి మృతి చెందినట్టు ప్రకటించింది. 
 
బాలుడి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించగా.. నిఫా వైరస్‌గా వైద్యులు నిర్ధారించడం జరిగింది. 
 
బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించినట్టు తెలిపారు. మరో 188 డైరెక్ట్ కాంటాక్ట్‌లను గుర్తించగా.. 20 మందిని హై-రిస్క్‌ కేటగిరీలో చేర్చినట్టు వివరించారు.
 
నిఫా కూడా కోవిడ్‌ లాగానే జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్. ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ జంతువులకు, ఆపై మనుషులకు సోకుతుంది. పందులు, కుక్కలకు కూడా ఈ వైరస్‌ సోకినప్పటికీ, మనుషులపైనే అధిక ప్రభావం ఉంటుంది. 
 
విపరీతమైన తలపోటు, బ్రెయిన్‌ ఫీవర్‌, నిరంతర దగ్గుతో కూడిన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, కండరాల నొప్పి, వాంతులు, గొంతులో మంట, మైకం, మగతగా ఉండటం, మెదడువాపు, మూర్చ ఈ వ్యాధి లక్షణాలు
 
నిఫా వైరస్‌ కట్టడికి ఎలాంటి వ్యాక్సిన్‌ లేదు. ఫిజికల్‌ డిస్టేన్స్‌, శుభ్రత పాటించడం లాంటి కరోనా నిబంధనలు పాటించడం ద్వారా నిఫాను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 
కేరళలోని కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లో 2018లో తొలిసారిగా నిఫా వెలుగుచూసింది. అప్పట్లో నెల వ్యవధిలోనే వైరస్‌ బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి నిఫా విస్తరిస్తుండటం.. మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలి: ఆర్‌.కృష్ణయ్య